• Bharatadesa Katha
  • Ebook Hide Help
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతదేశ కథ

    Bharatadesa Katha

    Author:

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సర్‌వాల్టర్ ర్యాలేని లండన్ టవర్‌లో నిర్బంధించినపుడు అతడు ప్రపంచ చరిత్ర వ్రాయడం ప్రారంభించాడంటారు. ఒకనాడు అతనిగది కిటికీ క్రింద ఒక దెబ్బలాట శబ్దాలను విన్నాడు. బయటికి చూడగా ఒకడు మరొకణ్ణి చంపడం కనిపించింది. ఆ కలహానికి కారణమేమిటో ఆచూకీ తీయ ప్రయత్నించాడు. ఆ జగడానికి మూలమేదో చెప్పమని జైలు అధికార్లని మళ్ళీ మళ్ళీ అడిగినప్పటికి ప్రయోజనం లేకపోయింది. వారు అసలు కారణాన్ని చెప్పనేలేదు. తన కిటికీ వద్ద జరిగిన సంఘటనల్లోని నిజానిజాల్ని స్పష్టంగా తెలుసుకోలేని తాను అనేక సంఘటనలతో కూడిన చరిత్రని ఎలా వ్రాయడమా అనే సందిగ్ధంలో పడి అసలు గ్రంథ రచన ప్రయత్నాన్నే విరమించుకున్నాడు.

భారతదేశ సంగ్రహ చరిత్రను వ్రాస్తున్న తరుణంలో ఆ కథే నా మనసులో మెదిలింది. వేలవేల సంవత్సరాల సుదీర్ఘకథలోని ప్రతి సంఘటనా కచ్చితంగా ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? కనుక, ఈ పుస్తకంలో మనదేశ చరిత్రని రేఖా మాత్రంగానే చెప్పడానికి ప్రయత్నించాను. దీనిని అంతవరకే తీసుకోవలసిందిగా కోరుతున్నాను. చిన్నపిల్లలకు దేశచరిత్రని గురించిప్రాథమిక సమాచారం అందించడానికే ఈ పుస్తకం ఉద్దేశింపబడినది. ఇది మనదేశ చరిత్రని మరింత సమగ్రంగా తెలుసుకొనడానికి కుతూహలం కలిగించగలదని అనుకుంటున్నాను.

- ముల్క్‌రాజ్ ఆనంద్

Preview download free pdf of this Telugu book is available at Bharatadesa Katha