• Yuddhakala
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 38.4
    48
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యుద్ధకళ

    Yuddhakala

    Pages: 68
    Language: Telugu
    Rating
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    '4.36/5' From 11 votes.
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    '4.40/5' From 5 premium votes.
Description

జీవితంలో యుద్ధం అనివార్యమైనది. యుద్ధం చేయాలా వద్దా అని నిర్ణయించుకోగల స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. ఎవరైనా సరే మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం, విజయాన్ని సాధించడం కోసం యుద్ధం చేసితీరాలి. అటువంటి యుద్ధానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సుబోధకంగా వివరిస్తుంది ‘యుద్ధకళ’ అనబడే ఈ చిరు గ్రంథం.

ఈ గ్రంథ రచయిత క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందిన చైనా దేశపు సైనిక వ్యూహకర్త అయిన సన్–జు (Sun-Tzu).

ఈ గ్రంథంలో సన్-జు ప్రతిపాదించిన సూత్రాలను అనుసరించడం వలనే వియత్నాం లాంటి చిన్నదేశం, పేదదేశం అమెరికాలంటి అతిపెద్దదేశం, అపరిమితమైన ఆర్ధికశక్తి, సైనికశక్తి ఉన్న దేశాన్ని ఓడించడం జరిగినది.ఈ యుద్ధ సమయంలోనే (1960వ దశకం) అమెరికా సైనికాధికారులు వియత్నాం గెలుపులో కీలక పాత్ర వహించిన ఈ గ్రంథం గురించి తెలుసుకుని అప్పటినుండి ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు.

ఈ గ్రంథం యొక్క ఫ్రెంచ్ అనువాదం ఫ్రాన్సు దేశంలో ఓ ‘నెపోలియన్’ రూపొందడానికి కారణమయినదంటే అది అతిశయోక్తి కాదు.

ఈ గ్రంఠం గురించి కొన్ని విశేషాలు:

  • ఆధునిక యుద్ధానికి రూపురేఖలందించిన నెపోలియన్ తను నిదురించే సమయంలో సైతం ఈ గ్రంథాన్ని చెంతనే ఉంచుకొనేవాడు.
  • ఆధునిక కాలంలో వామపక్ష గెరిల్లా పోరాటాలకు మార్గదర్శకంగా ఉన్న గ్రంథం ‘గెరిల్లా వార్‌ఫేర్ ‘. దీనిని చైనా నాయకుడు మావో సన్-జు ‘యుద్ధకళ’ ఆధారంగానే రచించాడు.
  • కొంతకాలం క్రిందటివరకు సంపన్న పాశ్చాత్యుల డైనింగ్ టేబుల్ సంభాషణలలో ఈ గ్రంథం గురించి చర్చించడం ఒక ఫ్యాషన్.
  • ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసిన ఉత్సాహంలోనే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారతదేశం మీద కార్గిల్ యుద్ధానికి పథకరచన చేశాడు.
  • ప్రాచీన కాలంలో రచింపబడిన ఈ గ్రంథం నేటి ఆధునిక కాలంలో కూడా అనుసరింపదగినదిగా ఉండి అంతకంతకూ తన ప్రాధాన్యతను పెంచుకుంటూనే ఉన్నది. ఈ గ్రంథం సైనికరంగంతో పాటుగా రాజకీయ, వ్యాపార, మానేజిమెంట్ వంటి అనేక ఇతర రంగాలలో కూడా విశేషమైన వ్యాప్తిని పొందినది.

    ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం... ఇది ఒక మానసిక శాస్త్ర గ్రంథం.

    మాకియవెల్లి (Machiavelli) యొక్క ప్రఖ్యాత రచన ‘The Prince’ తో సమానంగా, ప్రపంచవ్యాప్త ఆదరణ చూరగొన్న ఈ గ్రంథాన్ని మీరు కూడా చదవండి!

    Preview download free pdf of this Telugu book is available at Yuddhakala
Comment(s) ...

As I was reading different books, I came across with the books of Robert Greene, an American writer. I got a lot of inspiration from his books. He himself got inspiration from some age old books like ‘The Prince’ by Machiavelli, ‘The Art of Love’ by Ovid and ‘The Art of War’ by Sun-Tzu for writing ‘The 48 Laws of Power’, ‘The Art of Seduction’ and ‘The 33 Strategies of War’ respectively. These books contain a very different and exotic thinking from the typical thinking of Indian people. So, to introduce those thoughts to our people, I decided to translate those ancient books into Telugu.

Hi Kinige,

Please provide Print book " YUDDAKALA"