• Misses Samanyudu Section 494
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిసెస్ సామాన్యుడు... సెక్షన్ 494

    Misses Samanyudu Section 494

    Author:

    Pages: 63
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఇరవైనాలుగేళ్ల క్రిందట ఆంధ్రభూమి మాసపత్రికలో రాసిన నవలిక ఇప్పుడు ద్వితీయ ముద్రణగా మీ ముందుకు వచ్చింది. సెక్షన్ 494 రాయాలన్న తపనే నాకున్న అర్హత. అంతకు మించి మరేమీ లేదు. జర్నలిస్ట్ గా వున్నప్పుడు కొందరు అమ్మాయిల బాధలు...భర్త రెండవ వివాహం చేసుకోవచడం...భర్త పెళ్లి చేసుకున్నాడని నిరూపించే సాక్ష్యాలు లేకపోవడం..కొందరు డిప్రెషన్ తో ఆత్మహత్యలకు పాల్పడడం చూసినప్పుడు వచ్చిన ఆలోచన సెక్షన్ 494...
ఇది అమ్మాయిల కోణంలో...బాధిత మహిళల కోణంలో రాసిన నవల
హారిక జీవితాన్ని విషాదాంతం చేయడం ఇష్టం లేదు. అప్పటి ఆంధ్రభూమి మంత్లీ ఎడిటర్ సికరాజు (శ్రీ కనకాంబరరాజు) గారి సూచన మేరకు అలా రాసాను..ఒక విధంగా కథను విషాదాంతం చేయడం వల్ల సెక్షన్ 494...తీవ్రత పాఠకులకు సరిగ్గా రీచ్ అయ్యింది. హారిక పాత్రతో కనెక్ట్ అయ్యారు...అప్పటి ట్రెండ్‌కు ఆ విషాదాంతం సరైనదే...కానీ ఇప్పుడైతే మళ్ళీ రివైజ్డ్ ఎడిషన్ లో మార్చాలని అనిపించినా ఆ ఫ్లేవర్..ఆ ఫీల్ ని మార్చడం ఇష్టం లేక యథాతథంగా అందిస్తున్నాను.
ఇప్పుడైతే ఓ థ్రిల్లర్ గా ప్లాన్ చేసేవాడిని.మరో విధంగా....ప్లాన్ చేసేవాడిని...
ఈ నవలతో పాటు ...
భర్త కోరికకు తల ఒగ్గి ఆ సామాన్యుడి భార్య ఏం చేసింది?
మిసెస్ సామాన్యుడు
తమకోసం బ్రతుకు పోరాటం సాగిస్తున్న భర్తకోసం, దేశంలోని కోట్లాది సగటు సామాన్యులకు ప్రతినిధి అయిన మిసెస్ సామాన్యుడు భర్త కోసం ఏం చేసింది?కాలయంత్రంలో వెనక్కి వెళ్లి ఈ కథలను చదవండి.
*ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కొడుకును చివరిక్షణంలో చూడాలని వచ్చింది. ఆ కొడుకు తల్లి ఒడిలో తలపెట్టి ఏడ్చేశాడు..తల్లి ఒడిలో పడుకున్నాడు..తెల్లవారుతుండగా ఊళ్ళో తల్లి దగ్గర పనిచేసే పాలేరు వచ్చి తల్లి మరణవార్త చెప్పాడు...
అమ్మ మనసు
*భ్రూణహత్యకన్నా ప్రాణ త్యాగమే మేలని ఆ తల్లి ఎందుకు భావించింది?
తల్లీ, రాక్షసి! తల్లీ రాక్షసి...
*అవును...బంటీ చావలేదు... బంటీని వాళ్ల తల్లిదండ్రులే చంపేశారు..చదువు పేరుతో చిన్నారులను...
పాపను చంపేశారు
*చేసిన నేరానికి శిక్ష తప్పించుకున్న అతడికి చేయని నేరానికి శిక్ష పడేలా చేసింది...సుధేష్ణ అపార్ట్మెంట్ లో ఏం జరిగింది?
ప్రతీకారం (క్రైమ్ కథ)
మిమ్మల్నికాలయంత్రంలో అక్షరాల ప్రపంచంలోకి తీసుకువెళ్లే మిసెస్ సామాన్యుడు ...సెక్షన్ 494

Preview download free pdf of this Telugu book is available at Misses Samanyudu Section 494
Comment(s) ...

"ఇది అమ్మాయిల కోణంలో...బాధిత మహిళల కోణంలో రాసిన నవల
హారిక జీవితాన్ని విషాదాంతం చేయడం ఇష్టం లేదు. అప్పటి ఆంధ్రభూమి మంత్లీ ఎడిటర్ సికరాజు (శ్రీ కనకాంబరరాజు) గారి సూచన మేరకు అలా రాసాను..ఒక విధంగా కథను విషాదాంతం చేయడం వల్ల సెక్షన్ 494...తీవ్రత పాఠకులకు సరిగ్గా రీచ్ అయ్యింది. హారిక పాత్రతో కనెక్ట్ అయ్యారు...అప్పటి ట్రెండ్‌కు ఆ విషాదాంతం సరైనదే...కానీ ఇప్పుడైతే మళ్ళీ రివైజ్డ్ ఎడిషన్ లో మార్చాలని అనిపించినా ఆ ఫ్లేవర్..ఆ ఫీల్ ని మార్చడం ఇష్టం లేక యథాతథంగా అందిస్తున్నాను.
ఇప్పుడైతే ఓ థ్రిల్లర్ గా ప్లాన్ చేసేవాడిని.మరో విధంగా....ప్లాన్ చేసేవాడిని"
రచయిత మాటల్లోని నిజాయితీ,ఇందులోని కథలు మనస్సుతో చదివిస్తాయి.మస్తిష్కంతో ఆలోచించేలా చేస్తాయి.