• Marana Sasanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    120
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మరణ శాసనం

    Marana Sasanam

    Author:

    Pages: 182
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 21 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 20 premium votes.
Description

మరణ శాసనం ...Judgment ....
ఉరితీసే ముందు నా చివరికోరిక ఒకేఒకటి..నేను ఉరికొయ్యకు వేలాడుతోన్న దృశ్యాన్ని నా మిత్రుడు చూడాలి.చెప్పాడు సత్యవర్ధన్
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో ఉరికొయ్యకు బిగుసుకుపోయి ప్రాణం కోల్పోయి చట్టబద్ధంగా హత్యచేయబడ్డ నా మృతదేహాన్ని చూడు..."కొద్దీ క్షణాల్లో నల్లటిగుడ్డ అతని మొహం మీద కప్పబడింది.చెక్కతలుపు మీద అతను...లివర్ కదిలింది.ఉరికొయ్యకు అతని దేహం వేలాడింది...
ఈ వ్యవస్థలోని లోపాలకు అతని మరణమే ...మరణశాసనం కావాలి...ఆ క్షణమే వర్షం మొదలైంది...
మరణానికి ముందు మిత్రుడు రాసిన ఉత్తరం అతడిని యుద్ధభూమి వైపు నడిపించింది...
*నువ్వు నన్ను ప్రేమించినా...ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను..ఇది ఫిక్స్...చెప్పాడు సాకేత్ ఆముక్తమాల్యదతో.
*"ఉద్యోగం వస్తే రోజుకో కొబ్బరికాయ కొడతానని నువ్వు మొక్కుకుంటున్నావు...నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుగా వున్న కొబ్బరికొట్టు వాడు ఎదురుచూస్తున్నాడు..అయినా శరీరాన్ని ఇలా ప్యాక్ చేస్తే నీకు ఉద్యోగం ఎవరిస్తారే .."దెబ్బయేళ్ళ బామ్మ మనవరాలు ఆముక్తమాల్యదతో అంది.
* బాబాలు స్వామీజీలు ప్రజల బలహీనతలతో ఆడుకునే వ్యవస్థలో నుంచి పుట్టుకువచ్చిన పుట్టగొడుగు కృష్ణస్వామి కి పరమభక్తురాలు అముక్త...అక్కడ ఆ ఆశ్రమంలో జరిగే తంతు చూసేక ఎలా రియాక్టయింది?
రంగస్థలమ్మీద నటించే అతను జీవిత రంగస్థలంమీద యుద్ధం మొదలుపెట్టాడు..మారణశాసనాన్ని పునర్లిఖిస్తున్నాడు.
ప్రముఖరచయిత విజయార్కె
ఆంధ్రభూమి వారపత్రికలో ఇరవైనాలుగువారాలపాటు సీరియల్ గా రాసిన జడ్జ్ మెంట్ ప్రజల బలహీనతలతో ఆడుకునే స్వామీజీలకు ,వ్యవస్థలోని లోపాలకు మరణశాసనం గా మీ ముందుకు వచ్చింది.

Preview download free pdf of this Telugu book is available at Marana Sasanam
Comment(s) ...

ఇలాంటి నవలలు అరుదుగా వస్తాయి...పాతికేళ్ల క్రిందటి నేను కాలేజీరోజుల్లో చదివిన నవల ( ఆంధ్రభూమి వీక్లీ లో సీరియల్ ) ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను.అయినా అదే కొత్తదనం.ఇప్పటికీ దొంగస్వాములు పుడుతూనే వున్నారు.సత్యవర్ధన్ భార్య పాత్ర ఈ సమాజాన్ని వ్యవస్థను నిలదీస్తుంది.
ఆముక్తలోని అమాయకత్వం..సాకేత్ లోని మైండ్ గేమ్ కాన్సెప్ట్..సూపర్బ్ ...విజయార్కె గారి స్వాతిలో కథలు ,కామెడీ సరసమైన కథలు...ముఖ్యంగా మనసును కదిలించే నిర్ణయం నవల..( స్వాతి మంత్లీ అనుబంధ నవల ,ఈ నవల కన్నడ అనువాదాన్ని చదివాను ) మర్చిపోలేను.

చాలా అద్భుతమైన నవల..ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.అముక్త సాకేత్ పాత్రల్లో నవ్యత వుంది.సాకేత్ పాత్రలో ధీరోదాత్తత ఉట్టిపడుతుంది.స్వామీజీ పాత్ర ఇప్పటి దొంగబాబాల స్వామీజీల వికృతరూపాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. డాలర్ విలువ బంగారం విలువతోపాటు ఒక మేథావి సంపాదించిన డిగ్రీల విలువ ప్రకటించాలన్న నిష్టుర నిజాలు ఆలోచింపజేస్తాయి.
సత్యవర్ధన్ ఉరికొయ్యకు వేలాడుతూ మాట్లాడిన చివరిమాటలు మన సమాజాన్ని ప్రశ్నిస్తాయి.దాదాపు పాతికేళ్ల క్రితమే ఆంధ్రభూమి వీక్లీలో చదివిన నవల ఇది.

పాఠకుల హృదయాల్లో నిలిసిఫిపోయే నవల ...అముక్త మాల్యద పాత్ర అద్భుతం..సాకేత్ పాత్ర పాఠకులను మెస్మరైజ్ చేసి మరోప్రపంచంలోకి తీసుకువెళ్తుంది.స్వామీజీ పాత్ర దొంగబాబాల గుట్టు విప్పుతుంది.
ఈ ఒక్క వాక్యం నవలలోని అంతరార్థాన్ని విప్పి చెబుతుంది.హేట్సాప్ ..
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో ఉరికొయ్యకు బిగుసుకుపోయి ప్రాణం కోల్పోయి చట్టబద్ధంగా హత్యచేయబడ్డ నా మృతదేహాన్ని చూడు..."కొద్దీ క్షణాల్లో నల్లటిగుడ్డ అతని మొహం మీద కప్పబడింది.చెక్కతలుపు మీద అతను...లివర్ కదిలింది.ఉరికొయ్యకు అతని దేహం వేలాడింది...
పదేపదే చదవాలనిపించే నవల మరణశాసనం

*"ఉద్యోగం వస్తే రోజుకో కొబ్బరికాయ కొడతానని నువ్వు మొక్కుకుంటున్నావు...నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుగా వున్న కొబ్బరికొట్టు వాడు ఎదురుచూస్తున్నాడు..అయినా శరీరాన్ని ఇలా ప్యాక్ చేస్తే నీకు ఉద్యోగం ఎవరిస్తారే .."దెబ్బయేళ్ళ బామ్మ మాటలు ఆహ్లాదపరుస్తూనే ఆలోచింపజేస్తాయి....చాలా మంచి నవల..ఎమోషన్స్ ఎంటర్టైన్మెంట్ మెసేజ్ ..చదువరులను సాహితీప్రపంచంలోకి తీసుకువెళ్లే థ్రిల్లర్.సాకేత్ అముక్త సత్యవర్ధన్ స్వామీజీ పాత్రలు హైలెట్ ...

ఆలోచన రేకెత్తిస్తూ యువతలో శక్తిని నింపి వ్యవస్థను నిలదీస్తూ ప్రతీఒక్కరినీ ఆలోచింపజేసే నవల.

రంగస్థలం మీద నటించే హీరో జీవితంలో నటిస్తే...అమ్మాయిలు అబ్బాయిలు అమ్మలు బామ్మలు నాన్నలు అందరూ చదవవలిసిన నవల.చాలా ఆలస్యంగా చదివాను.అద్భుతమైన నవల...కొన్ని పాత్రలు మనల్ని వెన్నాడుతూనే ఉంటాయి.నా మనసును హత్తుకున్న నవల

great attempt ...శైలి కథ కథనం సింప్లి సూపర్బ్ సర్

చదివిన ప్రతీసారి కొత్తగానే అనిపిస్తుంది.మళ్ళీమళ్ళీ చదవాలని అనిపిస్తుంది.ఆముక్తమాల్యద పాత్ర చాలా బావుంది.ప్రారంభంలో ఉడుత కథ కన్నీళ్లు తెప్పించింది.