• Kavitaa 46
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 46

    Kavitaa 46

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నీడలు


ఎన్ని నిశ్శబ్దాలు కబళిస్తున్నా
ఎన్ని నిరాశలు కమ్మేసినా
ఎన్ని నిస్పృహలు ఆవరించినా
కొంత ఏకాంతం ఊరడిస్తుంది
నిదానించమని నిమ్మలించమని


సంద్రాన్ని సంగమం అలరిస్తున్నా
కెరటాలు కేరింతలతో కవాతుచేస్తున్నా
ఆటుపోటులు తప్పవంటూ
ఉప్పెనలు ఊపిరాడనివ్వవనుకుంటూ
దిగులు దిగులుగా దిగమింగేస్తున్నా


ఏదో ఒకనాడు
కొన్ని మౌనాలు పగుల్తాయి
కొన్ని నిశ్శబ్దాలు శబ్దిస్తాయి
కొన్ని జ్ఞాపకాలు చిట్లుతాయి
కొన్ని నీడలు జడలిప్పుతాయి
కొన్ని నమ్మకాలు నిలబెడతాయి
నిజాలు భగ్గుమన్నా పర్వాలేదు
నీ హృదయం ముక్కలు కానివ్వకు.

- లాస్య ప్రియ కుప్పా

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 46