• Javaleelu
  • Ebook Hide Help
    ₹ 117
    130
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జావళీలు

    Javaleelu

    Pages: 201
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గానానికి, అభినయానికి సరిసమానంగా ఉపయోగపడే సంగీత రచనలు జావళీలు. వీటి రచన 19వ శతాబ్దం నుండే మొదలయ్యింది. రక్తికి పేరుగాంచిన దేశి రాగాలు ఫరజ్, జంజోటి, కాపి, బేహాగ్, హమీర్‌కల్యాణి వంటి రాగాలలో వీటికి స్వరరచన చేస్తారు. తెలుగు వాగ్గేయకారులే కాకుండా తమిళ, కన్నడ వాగ్గేయకారులు కూడా తెలుగులోనే జావళీలు రచించారు. కర్ణాటక సంగీతానికి సరైన మాధ్యమం తెలుగే అని జావళీలు సైతం నిరూపించాయి.

గాయకులు సంగీత సభలలో జావళీలను పాడి శ్రోతలను ఆనందపరిచారు. నాట్యకళాకారులు వీటిని అభినయించి వీక్షకులను సమ్మోహితులను చేశారు. మనోరంజకమైన విశిష్ట సాంస్కృతిక ప్రక్రియగా మొదలై సాహితీ కళాసంపదగా జావళి వర్ధిల్లింది.

తెలుగుభాషలోని జావళీలన్నీ ఇప్పటివరకూ ఒకచోట సంకలనం కాలేదు. ఎన్.సి. పార్థసారథి, ద్వారక పార్థసారథి చేసిన జావళీల సంకలనంలో సుమారు 100 వరకు వున్నాయి. సంగీత గ్రంథాలలో, గానకళాబోధినులలో ఇంకా అనేకం అసంకలితంగా వున్నాయి.

తెలుగులోవున్న జావళీలన్నింటినీ ఒకచోట చేర్చటానికి మిత్రుడు రవికృష్ణ చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. త్వరలోనే రెండవ సంపటాన్ని కూడా ప్రచురించి అన్ని జావళీలను రసజ్ఞలోకానికి అందించాలని కోరుతున్నాను.

- డా. దీర్ఘాసి విజయభాస్కర్

గమనిక: "జావళీలు" ఈబుక్ సైజు 6.3 mb

Preview download free pdf of this Telugu book is available at Javaleelu