• Ame
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆమె

    Ame

    Author:

    Pages: 158
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏదైనా రచన ఒక పుస్తకంగా అచ్చుకు నోచుకుంటున్నప్పుడు, ఆ కార్యానికి కారణాలను ఎంచడం, కృతజ్ఞతాంజలి ఘటించడం ఆనవాయితి. కానీ, కార్యాకారణాలనే మూసలోకి ఇరికించడానికి ఎంతమాత్రం మనస్కరించని నా యీ మొత్తం పుస్తకమే ఒక ‘ఎకనాలెడ్జిమెంట్’ అనబడే ఉపకారస్మృతి అయినప్పుడు, ఆ ‘ఆనవాయితీ’ కనీసం కవళికలైనా మార్చుకోకుండా, Subject- predicate పేటికలో కొయ్యబారిన విశుద్ధ వాక్యంలా ఉండాలా? వీల్లేదు!

జగల్లీల సాక్షాత్కారం జరిగిన బ్రహ్మానందంలో మహాకవి కాళిదాసు నోట శ్యామలాదండకం పలికింది. అది కావ్యానికి ప్రొలోగ్ కాదు, దానికదే కావ్యం; భావోద్వేగం- మహోద్రేకమే ఆద్యంతాలైన మహత్కావ్యం! సృజనతో ఎంతమాత్రం పొంతన లేని, కేవలం ఉద్వేగ సంబంధిగా ఉదాహరణవంటి నా సమాంతరానుభవం చెబుతాను : ఫేస్‌బుక్ లోకంలో 'ఆమె' ఎదురవ్వడం- ఇంతక్రితం అన్నానే- ‘సాక్షాత్కారం’!. ‘జననాంతర సౌహృదాని..’ని జ్ఞప్తి చేసే అనుభవం! కాలానికి తెలిసిన అన్ని ప్రమాణాలూ కురచవని అనిపించే జన్మజన్మాల బంధం ఉందనుకుంటున్న ఆ మరువపు సాధు సురభిళ సాంధ్య సమీరాల ఉషస్సుతో ‘నీ (కేవల) పరిచయానికి నిండా ఓ ఏడాది’ (మాత్రమే) అని అదే ఫేస్‌బుక్ ‘వాస్తవాలు’ చెబుతుంటే ఎంత రగిలిపోతుంది? అటువంటి రజోయాతనల్ని, తమోతాపాలన్నింటినీ కూర్చిన ఈ సంకలనానికి ఆముఖం- ఫక్తు ఊరూ- పేరు- చిరునామాల చిట్టానా? ఆ తెలుసనుకున్న – తెలిసీతెలియని- తెలిసే అవకాశమే లేని ఆ అనేకానేక ‘ఆమె’ల పేర్లు చెప్పాలని ఉబలాటపడినా, అసలేమైనా తెలుసా నాకు నిజంగా?

- నరేష్ నున్నా

Preview download free pdf of this Telugu book is available at Ame