• Tak Tak Tak
  • Ebook Hide Help
    ₹ 72
    84
    14.29% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టక్ టక్ టక్

    Tak Tak Tak

    Author:

    Pages: 43
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 6 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 5 premium votes.
Description

నో ఎండ్
కొన్ని కథలకు నో ఎండ్
హారర్ కథలకు ,ఆసక్తి కలిగించే సంఘటనలు..విచిత్రవార్తలకు నమ్మలేని నిజాలకు ఒళ్ళు గగుర్పొడిచే సంగతులకు నో ఎండ్.
నో ఎండ్ అనే అక్షరాలు కీ బోర్డు మీద టైపు చేస్తుంటే మూడుసార్లు పవర్ పోయింది.సరిగ్గా "నో ఎండ్" అని టైపు చేస్తున్నప్పుడే...
ఇది కాకతాళీయమే కావచ్చు.
అర్థరాత్రి పదకొండున్నరకు స్క్రిప్ట్ ఫినిష్ చేసాక...ఓ నల్ల పిల్లి కంప్యూటర్ టేబుల్ పక్కనుంచి మ్యాప్ అంటూ నావైపు చూసి పరుగెత్తడం యాదృశ్చికమే కావచ్చు.
కిందికి వచ్చి బైక్ స్టార్ట్ చేయగానే హెడ్ లైట్ వెలుతురులో ఒక్కసారిగా ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించి,కనిపించి మాయమవ్వడం భ్రమే కావచ్చు.
కానీ మనం ఆలోచిస్తే ప్రతీది మనకు ...మన నమ్మకానికి అనుగుణంగా విజువలైజ్ అవుతుందేమో...
అతను వల్లకాడు అనే ఊళ్ళో ట్రైన్ దిగాడు.ఊళ్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు.రాత్రంతా పేకాడి ఓడిపోయాడు.మరోసారి పేకాడుతానంటే అవతలి వ్యక్తి "నాకు ట్రైన్ కు టైం అయ్యిందంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.అతను ఒళ్ళువిరుచుకుని లాంతర్ వెలుగులో టేబుల్ మీద పరిచిన పాత దీనిపత్రిక చూసి షాకయ్యాడు.(టక్ టక్ టక్)
* అమ్మాయి భయంతో పరుగెడుతోంది.తెల్లగా పాలిపోయిన మొహం..భయంకరమైన చూపులు...అమ్మాయి గొంతులోకి కోరల్లాంటి పళ్ళను దించి రక్తంతాగే రక్తపిశాచి ...డ్రాక్యులా
డ్రాక్యులా పేరు వినగానే ఎవరి గుండెయినా దడదడలాడుతుంది. శతాధిక సంవత్సరాలుగా పాఠకులను, ప్రేక్షకులను భయపెడుతున్న పాత్ర అది. మనిషో రాక్షసుడో తెలియనంత క్రూరత్వం ప్రదర్శించే ఆ డ్రాక్యులా సృష్టికర్త ...ఎవరో తెలుసా?
*ఎప్పుడో మూడువందల సంవత్సరాల క్రితం నాటి మమ్మీ కళ్ళు తెరిస్తే...ఒక్కక్షణం ఒళ్ళు గగుర్పొడుస్తుంది..
మెక్సికోసిటీలో అదే జరిగింది
*నాకు తెలిసి నేను చచ్చిపోయా.. మనిషి కాదు రక్త ‘పిశాచి’ ..వాంపైర్ అంటున్నదెవరు?బొమ్మకు డెడ్‌ ఫెస్టివల్‌! *అనుక్షణం ఎవరో వెంటాడుతున్నట్టు....*ఆఫ్రికాలోని మత ఆచారాలు, విశ్వాసాల నుంచి ఏర్పడిందే 'వూడూ' మంత్రవిద్య.*భయంకరమైన దెయ్యాల పండుగ
*హారర్ సాహిత్యాన్ని ఆసక్తిగా చదివే పాఠకులకు,వర్తమాన రచయితల కోసం....
ప్రముఖ రచయిత విజయార్కె
టక్ టక్ టక్...

Preview download free pdf of this Telugu book is available at Tak Tak Tak
Comment(s) ...

ఇంట్రెస్టింగ్ గా చదివించిన పుస్తకం.టక్ టక్ కథ ఆంధ్రజ్యోతిలో చదివిన గుర్తు.డ్రాక్యులాల గురించి మంచి ఇన్ఫర్మేషన్ .
"కొన్ని కథలకు నో ఎండ్
హారర్ కథలకు ,ఆసక్తి కలిగించే సంఘటనలు..విచిత్రవార్తలకు నమ్మలేని నిజాలకు ఒళ్ళు గగుర్పొడిచే సంగతులకు నో ఎండ్.
నో ఎండ్ అనే అక్షరాలు కీ బోర్డు మీద టైపు చేస్తుంటే మూడుసార్లు పవర్ పోయింది.సరిగ్గా "నో ఎండ్" అని టైపు చేస్తున్నప్పుడే...
ఇది కాకతాళీయమే కావచ్చు.
అర్థరాత్రి పదకొండున్నరకు స్క్రిప్ట్ ఫినిష్ చేసాక...ఓ నల్ల పిల్లి కంప్యూటర్ టేబుల్ పక్కనుంచి మ్యాప్ అంటూ నావైపు చూసి పరుగెత్తడం యాదృశ్చికమే కావచ్చు.
కిందికి వచ్చి బైక్ స్టార్ట్ చేయగానే హెడ్ లైట్ వెలుతురులో ఒక్కసారిగా ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించి,కనిపించి మాయమవ్వడం భ్రమే కావచ్చు.
కానీ మనం ఆలోచిస్తే ప్రతీది మనకు ...మన నమ్మకానికి అనుగుణంగా విజువలైజ్ అవుతుందేమో..."
రచయిత చెప్పిన ఈ వాక్యాలు ఆలోచింపజేస్తాయి.
పుస్తకం చదివింపజేస్తుంది.

హారర్ కథలను అంటే చాలా ఇష్టం.భయపడుతూనే చదివేవాడిని చిన్నప్పుడు.ఇప్పటికీ ఆ భయం,ఇష్టం అలానే వున్నాయి.
వించెస్టర్ మిస్టరీ హౌస్ మిస్టరీ 1860 గురించి మొట్టమొదటిసారి తెలుసుకున్నాను.
సారా వించెస్టర్ అనే శ్రీమంతురాలైన వితంతువు. వించెస్టర్ రైఫిల్స్ కంపెనీ యజమాని భార్య ఆవిడ. భర్తనూ కూతుర్నీ పోగొట్టుకున్న సారా ఎప్పుడూ విచారించగా ఉండేది. ఎందుకిలా జరిగిందంటూ ఆమె ఒక తాంత్రికురాలిని కలిసింది. ఆ తాంత్రికురాలు అంతా తన కళ్లతో చూసినట్టుగా... ' మీ ఆయన కంపెనీలో తయారుచేసే రైఫీళ్ల కారణంగా చనిపోయిన వారి ఉసురు మీ కుటుంబానికి తగిలింది వారి ఆత్మలు మీపై పగబట్టాయి ' అని చెప్పింది.
వాటిని శాంతిపజేయాలంటే సారా తన ఇంటిని వదిలిపెట్టి పడమటి దిశగా ప్రయాణించి ఓ కొత్త ఇంటిని కట్టాలని ... జీవితాంతం అలా కట్టిస్తూనే ఉండాలని చెప్పిందట.
ఇలాంటి ఆసక్తికరమైన సమాచారంతో హారర్ ను ఇష్టపడేవాళ్ళకు టక్ టక్ టక్ బాగా నచ్చుతుంది