• Kottha Katha 2017
  • Ebook Hide Help
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొత్త కథ 2017

    Kottha Katha 2017

    Pages: 237
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

అవును... యివి కొత్త కథలు... సరికొత్త కథలు. యే కథకి ఆ కథే ప్రత్యేకమైనది. సమకాలీన తెలుగు కథా సాహిత్యంలోనే విభిన్న, వినూత్న గొంతుల మేలిమి కలయిక యీ “కొత్త కథ-2017.”

తాము చెప్పే విషయాన్ని యే పద్ధతిలో చెపితే కథానేపధ్యం పాఠకులకి అందుతుందో తెలిసి కథాశిల్పాన్ని సెట్ చేసుకున్న కథకులు ఈ సంకలనంలో ఉన్నారు. మ్యాజికల్ రియలిజం, వుత్తమ పురుష కథనంలో సాగిన కథలు చదువరిని కథల మీద నుంచి చూపు మరలనివ్వవు. అలానే కొంతమంది కథకులు కథా వస్తువుగా తమ మనసు పొరల్లో నిక్షిప్తమైన వొకానొక సమయపు సంక్లిష్టతను, అసహాయతను చెప్పాలనుకున్నప్పుడు తేటతెల్లంగా సాదాసీదాగా చెప్పడానికి ప్రయత్నించడం మనం గమనిస్తాం. ప్రతి కథా తనదైన దృష్టితో యెక్కడా సడలని కుతూహలంతో పాఠకులలో వివిధ యిమోషన్స్‌ని వుత్తేజితం చేస్తుంది. ఆలోచింపచేస్తుంది. ఆనందింపచేస్తుంది.

మధ్యతరగతి హిపోక్రసీ, సెన్సిబిలిటీస్ మీదే ఆధారపడి రచయితలు తమ క్రియేటివిటీని యిరుకు చేసుకోవలసిన అవసరం లేదని ఈ కథలు చెబుతున్నాయి. అలానే వివిధ దృక్పథాల నుంచి కథలు రాసేవాళ్ళు పాత మార్జిన్స్‌లోకే పరిమితం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నాయి.

ఆ విధంగా యీ సరికొత్త కథ 2017 యీ కథకులు చేసిన అవసరమయిన నిజాయితీ గల ప్రయత్నమని చెప్పగలుగుతున్నాం.

యిందులో వున్న రచయితల్లో యెప్పటి నుంచో రాస్తున్న లబ్ధప్రతిష్ఠులు వున్నారు. యిప్పుడిప్పుడే గొంతు సవరించుకుని అబ్బురపరుస్తున్న కొత్త కథకులు వున్నారు. యెప్పడో కానీ రాయని విలువైన రచయితలూ వున్నారు. యెజెండాలూ, జడ్జిమెంట్లూ లేని సంపాదకులుగా వుండాలని మా ప్రయత్నం. వెరసి తెలుగు కథ యెన్నెన్ని వైరుధ్యాల్ని పట్టుకోగలదో చూడాలనుకున్నాం. ప్రేమ, ప్రేమ రాహిత్యం, చీకటి బతుకులు, పల్లె పెడుతున్న కన్నీరు, నగర జీవన సంగ్రామం, యిదమిద్ధంగా యిదీ అని చెప్పలేని భావసాంద్రత యీ సంకలనంలో చూడవచ్చు.

- కుప్పిలి పద్మ
అక్కిరాజు భట్టిప్రోలు

Preview download free pdf of this Telugu book is available at Kottha Katha 2017