-
-
పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు - రివైజ్డ్
Pothuri Vijayalakshmi Hasya Kathalu Revised
Author: Pothuri Vijayalakshmi
Publisher: Sri Rishika Publications
Pages: 152Language: Telugu
శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి రచించిన హాస్యకథల సంపుటం ఇది. 24 కథలున్న ఈ సంపుటిలో ప్రతీ కథా హాయిగా నవ్విస్తుంది. చతురమైన సంభాషణలతో, అమాయకత్వంతో కూడిన సునిశిత హాస్యం అన్ని కథలలోనూ ఉంది. మచ్చుకి ఓ కథలోని సరదా ఘట్టం....
*****
పిల్లలకీ మేస్టార్లకీ మా అమ్మమ్మ నెత్తిమీద దేవత. వాళ్ళు గౌరవిస్తున్న కొద్దీ చనువు ఎక్కువయింది. అన్నిటా తలదూర్చడం ప్రారంభించింది.
ఒకరోజు దక్షిణం వైపు కూర్చుని అరటి దూట తరుక్కుంటోంది. పక్కన స్కూల్లో సోషల్మాస్టారు రామతారకంగారు పాఠం చెబుతున్నారు.
"మనదేశమును ఎందరో రాజులు పాలించిరి. అశోకుడు పాలిచ్చెను, హర్షవర్ధనుడు పాలిచ్చెను, చించిసారుడు పాలిచ్చెను" అంటూ దీక్షగా చెప్పుకుపోతుంటే అమ్మమ్మ "రామతారకంగారూ, ఇట్రండి. ఇందాకటి నుంచి వింటున్నాను. ఆ రాజు పాలిచ్చాడు, ఈ రాజు పాలిచ్చాడు అంటున్నారు. పాలివ్వడానికి వారేమయినా పాడిపశువులా?" అని అడిగింది.
ఆయన తడబడిపోయి, "అదికాదండీ పెద్దమ్మగారూ, పరిపాలించారు అని చెప్తున్నా" అన్నాడు.
"బాగానే ఉంది. మీరు వినలేదేమో! మొన్న దేవుడి గుళ్ళో వరికూటి జయమ్మగారు హరికథ చెబుతూ ఫలానా చక్రవర్తి ఫలాని నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలినారు అని ఎంత స్పష్టంగా చెప్పిందో! మీరూ అలాగే చెప్పొచ్చుగా. పాలిచ్చారు, పెరుగిచ్చారు అని సొంత కవిత్వం ఎందుకూ?" అంది. మేస్టారి మొహం చిన్నబోయింది.
పిల్లలంతా కిసుక్కున నవ్వేరు.
మేస్టారు ఏమీ చేయలేక బెత్తం తీసుకుని 'సైలెన్స్ సైలెన్స్' అని బల్ల మీద బాదేశారు.
*****
సున్నితమైన హాస్యాన్నిఆస్వాదించేందుకు ఈ పుస్తకం చదవాలి.
*****
కౌముది వెబ్ మ్యాగజైన్ 2012 లో ముద్రితమైన 'జ్ఞాపకాల జావళి' 13 వ్యాసాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.
I love this book, such an amazing writer. Completed in a week.
Rent option please