నోముల సార్ అన్‌టోల్డ్ లెసన్స్
ఈ పుస్తకం దివాకరుని కృష్ణమోహన్ శర్మ, కొంపెల్లి వెంకట్ గౌడ్ సంపాదకత్వంలో వచ్చింది. నల్లగొండలో మూడు దశాబ్దాల పైబడి పనిచేసిన ఆంగ్లోపన్యాసకులు నోముల సత్యనారాయణ సార్ అనుభవాలతో కూడిన రచన ఇది. నోముల సత్యనారాయణగారి జీవనశైలి, ఆంగ్ల ఉపన్యాసాల ప్రత్యేకత, పాండిత్య గరిమ గురించి ఈ తరానికి పరిచయం చేస్తుందీ పుస్తకం. తెలంగాణ నేల మీద నిసర్గమైన రీతిన జీవిస్తున్న ప్రతిభాశాలి నోముల సార్. ఈ పుస్తకాన్ని చదువుతుంటే వారి అనుభవాల్ని దగ్గర కూర్చుని విన్నట్లుగా ఉంటుంది. ఆ పద్ధతిన ఈ పుస్తకం రాశారు. మౌఖికమైన పద్ధతిలో జీవితానుభవాలని రికార్డు చేసి, రాయడం వల్ల వారి అభివ్యక్తి, వైచిత్రి కూడా తెలుస్తుంది. వారి భాషలోని సౌందర్యం ప్రతిఫలిస్తుంది. తెలుగు, ఉర్దు, ఇంగ్లీష్, సమ్మీశ్రితమైన నోముల సర్ మాటల్లోని వైవిధ్యం సుసంపన్నమైంది. వారి మూర్తిమత్వాన్ని ప్రత్యేకతని తెలియజెప్పే పుస్తకం ఇది. ఎంతో గొప్పగా చదువుకుని కూడా సాధారణంగా జీవించడంలోని ఔదాత్త్యం ఎరిగిన ఇలాంటి మనుషుల గురించి తెలంగాణా వారే కాదు, తెలుగు వారంతా తెలుసుకోవాలి. సృజనాత్మకంగా జీవించడమెలాగో తెలిసిన విలక్షణమూర్తి నోముల సార్. వారి అనుభవాలు తెలంగాణా సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఎన్నో ఉపకరణాలు అందిస్తాయి.
- గుడిపాటి.
పాలపిట్ట రివ్యూ, సెప్టెంబరు 2011.
- ₹ 60 MRP ₹ 75 (20% discount)
- Expected delivery days: 5
- Eligible for minimum shipping
- ₹ 30 Gift a Rent
- ₹ 67 Gift an Ebook

