• Script Sidhamga Undi Cinema Teeyandi
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది సినిమా తియ్యండి!

    Script Sidhamga Undi Cinema Teeyandi

    Pages: 105
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హీరోయిన్‌కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఎవరికంటా పడకుండా పరిగెడుతూ మధ్య మధ్య వెనక్కి తిరిగి చూస్తూ అమితవేగంగా పరిగెట్టి తన పేడ కంపెనీకి చేరింది. ఎదురుగా ఉన్నఎద్దు ముందు మోకాళ్ళూని కూర్చుంది. "చూడు, ఎద్దూ! మీరు నాకు చేసిన సాయం అంతా ఇంతా కాదు. నేను ఈనాడు ఇన్ని లక్షలు సంపాదించానంటే నువ్వు, నీ స్నేహితులు వేసిన పేడ కారణం గానే. ఈనాడు నాకు వచ్చిన కష్టం నుండి నన్ను కాపాడేందుకు మీరు తప్ప ఇంకెవరూ లేరు. నా కాబోయే భర్త ఆపదలో ఉన్నాడు. నా మనసు భాధ పడుతోంది. నేను అతన్ని ఎంత ప్రేమించానో మీకన్నా ఎక్కువగా ఇంకెవరికీ తెలియదు. అసలు నేను ఇల్లు వదిలి వచ్చింది ఎవరి కోసం? అతని కోసం. మిమ్మల్ని పెట్టుకొని వ్యాపారం మొదలు పెట్టింది ఎవరికోసం? అతని కోసం. అలాటి అతను ఆపదలో ఉన్నాడు. అతనికి ఏదైనా అపాయం జరిగితే నా బ్రతుకు వ్యర్ధం. నా జీవితం వృథా. నన్ను అర్ధం చేసుకో, ఎద్దూ! నా మాంగల్యం కాపాడు. నా కాబోయే భర్తని రక్షించు" అంది దీనాతి దీనంగా. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న సై.హీ. కూడా వచ్చి- "అవును ఎద్దూ! మనిషికన్నా పశువే నయం. నా భర్త కూడా ఆపదలో ఉన్నాడు. నా పసుపుకుంకుమలు రక్షించండి" అంది ఏడుస్తూ.

* * *

"ఎలా వుంది డాక్టర్ మా తమ్ముడికి?" అన్నాడు హీరో.

ధీర్ఘంగా నిట్టూర్చాడు. డాక్టర్ కళ్ళజోడు చేత్తో పట్టుకొన్నాడు. చూడండి అతనికి చాలా బలమైన గాయాలు తగిలాయి. రెండు గునపాలు పొడుచుకున్నాయి. కదా- వెన్నెముక మధ్యకి విరిగి పోయింది. లివరు చిరిగి చీలికలు, పీలికలు అయిపోయింది. కిడ్నీలు రెండూ కన్నాలు పడిపోయాయి. కడుపు కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. గుండెకు రూపాయ కాసంత కన్నం పడటం వల్ల రక్తం విపరీతంగా పోయింది" అన్నాడు గంభీరంగా.

"డాక్టర్" అన్నాడు హీరో దీనంగా.

"కంగారు పడకండి ప్రాణాపాయం ఏమీ లేదు. రక్తం ఎక్కించాలి" అన్నాడు డాక్టర్.

Preview download free pdf of this Telugu book is available at Script Sidhamga Undi Cinema Teeyandi
Comment(s) ...

The site has been down for 4 days now... and so far, haven't seen one sign of accountability by the folks running it! No status updates, no regret for the lack of customer service... no follow up on emails sent. Pathetic!! [I'm sure the admins would block this message, too]

Sir, Have you removed the rent option for the ebooks (For the recent ebooks)? If so please inform the members/Readers that rent option is not available. I am observing that most of the ebooks are costilier than the print books of the same Author available in the market. Sorry to say that.