-
-
మహానటి సావిత్రి
Mahanati Savitri
Author: Pallavi Garlapati
Pages: 344Language: Telugu
నేత్రాభినయంతోనే జనస్రవంతిని మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి జీవితం నాటకీయతలో ఆమె ధరించిన ఏ పాత్రకూ తీసిపోదు. తారాజువ్వలా తారామండలానికి ఎగిసి, మితిమీరిన బోళాతనంతో తోకచుక్కలా రాలి, రోగగ్రస్తమై, శల్యావశిష్టమైన శరీరంతో జీవన రంగస్థలినుండి నిష్క్రమించిన తారామణి ఆమె. కరుణకు, పరోపకారానికి చిరునామా అయిన ఆ సహృదయురాలి కథ కరుణామయగాథగా మిగిలిపోవడం గుండెలు పిండేటంతటి విషాదం. గొప్ప భావకవుల, భాసాది నాటకకర్తల ఊహకు సైతం అందనంత ‘మెలాంకలిక్ డ్రామా’!
ఆ విషాదాన్ని అక్షరీకరించడానికి శ్రీమతి పల్లవి కొత్త ప్రయోగం చేశారు. తారీఖుల వారీ జీవిత చరిత్రగా కాకుండ పఠితకు సావిత్రి హృదయాన్ని ఆవిష్కరించడానికి సినేరియో పద్ధతి ఎంచుకున్నారు. ఆనాటి సంఘటనలను కళ్లారా చూసినట్టుగా, అప్పటి సంభాషణలను స్వయానా విన్నట్టుగా సన్నివేశాలను కల్పించి, ఒక్కొక్కప్పుడు పాత్రలను సృష్టించి, పకడ్బందీగా స్క్రీన్ప్లే రాసినట్టు రాశారు. ఇది ఈమె తొలి రచనంటే నమ్మబుద్ధి కానంత లాఘవంగా రాశారు. ఇది రచనలో చేయి తిరిగిన వారు మాత్రమే సాహసించగల రచనా విన్యాసం!
- వరప్రసాద్
how to get this book for rent
This is a great book with a wonderful narration by the author, made me to sit and finish in one night without breaks. Even though there are so many books available on Savitri, this one stands as the best out of all. My respect towards Savitri increased a lot after reading this biography. Thanks a lot!!