సత్యభామ
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. బహుగ్రంథ రచయితగా ఆయన తెలుగు-హిందీ సాహిత్యాలకు వారధిగా నిలిచారు. శ్రీ లక్ష్మీప్రసాద్ మానవతావాది. సమన్వయ దృక్పథం కలిగినవారు.
ఆయన హిందీలో 'తెలుగుకే ఆధునిక్ కవి బైరాగి', 'హిందీ కవితాకో ఆంధ్రోకీ దేన్', 'ఆత్మహత్యా', 'కవిరాజ్ త్రిపురనేని కే దో పౌరాణిక్ నాటక్' మొదలైన గ్రంథాలను; తెలుగులో 'సప్త స్వరాలు', 'జాతినేత జయప్రకాశ్', ' వర్తమాన రాజకీయ దుస్థితి', 'కెరటాలు', 'తమస్', ' ఇరవై ఒకటో శతాబ్దంలోకి', ' వేదనాభరితం', 'యయాతి', 'హిందీ సాహిత్యచరిత్ర', 'డా. రామ్ మనోహర్ లోహియా', 'పుచ్చలపల్లి సుందరయ్య', 'డా. హరివంశ్ రాయ్ బచ్చన్ - ఆత్మకథ' మొదలైన గ్రంథాలను రచించారు. వందకు పైగా పరిశోధనా వ్యాసాలను ప్రకటించారు.
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 1996-2002 మధ్య రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అనేక జాతీయస్థాయి సంస్థలలో సభ్యులుగా ఉన్నారు. 'ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడెమీ'కి అధ్యక్షులు.
ఆయన అనేక పురస్కారాలు పొందారు. 2003లో ఆయనకు పద్మశ్రీ లభించింది. అనువాదానికీ, 'ద్రౌపది' నవలకూ సాహిత్య అకాడెమీ అవార్డులు పొందారు. బహు దేశాలు సందర్శించారు.
'లోక్ నాయక్ ట్రస్ట్' స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాహిత్యకృషికి ప్రోత్సాహం అందిస్తున్నారు.
* * *
"వెలుగు పుంజం దట్టమై శూన్యమైంది. ప్రకృతి స్తంభించిపోయింది. కోకిలలు మౌనం పాటించాయి. చెట్లు ఆకులు కదల్చడం లేదు. సెలయేళ్ళు ప్రవహించడం మానివేసాయి. పారిజాత పరిమళం మట్టివాసనలో ఇంకి పోయింది.
సత్యభామ దేహం మాత్రమే అక్కడ మిగిలింది. ఒక రసరమ్య ఘట్టం ముగిసి పోయింది.
- సత్యభామ
- ₹ 40 MRP ₹ 50 (20% discount)
- Expected delivery days: 5
- Eligible for minimum shipping
- ₹ 30 Gift a Rent
- ₹ 50 Gift an Ebook

