బైబిల్ కథలు

Bible Kathalu;
Published by:
  • |
  • New to Kinige?
  • |
  • Free Preview Download
  • |
  • Description

    గ్రేట్ ఆంధ్రా డాట్‌కామ్‌లో నేను "ఎమ్బీయస్ కబుర్లు" అనే శీర్షిక నిర్వహిస్తూ వుంటాను. నా ఆర్టికల్స్ తాలూకు ఆర్కయివ్స్ వెతుక్కోవడం కాస్త కష్టమైన పనే ! అందువలన నేను వాటిని గ్రేట్ ఆంధ్రా డాట్‌కామ్ సౌజన్యంతో ఈ-బుక్స్‌గా అందించబోతున్నాను. ఇవి పిడియఫ్ ఫార్మాట్‌లో ఈ బుక్స్‌లో లభిస్తాయి. పిడిఎఫ్ కాబట్టి ప్రింటవుట్ తీసుకోవడం కూడా సులభం.

    నేను నిర్వహించిన "బైబిల్ కథలు" శీర్షికలోని కొన్ని వ్యాసాలను ఈ పుస్తకంలో వెలువరిస్తున్నాను. ఇది మొదటి భాగం. హిందూ మత గ్రంథాల గురించి మనకు బాగానే తెలుసు. పత్రికలలో కథలు కథలుగా రాస్తారు. టీవీల్లో వాటి గురించి ప్రవచనాలు చెప్తూ వుంటారు.

    కానీ మనలో చాలామందికి యితర మతాల పురాణాల గురించి బొత్తిగా తెలియదు. అందువలన బైబిలు గురించి రాయడం మొదలు పెడుతున్నాను. ఎందుకంటే రామాయణ భారతాల్లాగే యిది కూడా మంచీ-చెడూ కలిసిన మనుష్యుల కథ. ఈర్ష్య, అసూయ, కామం, నమ్మకద్రోహం, ద్వేషం, ధిక్కారం ఎంటువంటి అనర్థాలు తెచ్చిపెడతాయో చెప్పే గాథ.

    నేను రాస్తున్నది మతప్రచారం కోసం కాదు. అందుకే మామూలు భాషలో, అతి వేగంగా, క్లుప్తంగా కథ మాత్రం చెపుతూ పోయాను. స్తోత్రాలు, ధర్మసూత్రాలు అవీ వదిలేశాను. ఈ రాయడంలో ఏమైనా తప్పులు దొర్లితే (పేర్ల విషయంలో ఎలాగూ దొర్లి వుంటాయి) ఎవరైనా సూచిస్తే సవరించుకుంటానని మనవి. ఈ పుస్తకంలో ఎందరివో చిత్రాలు వాడుకున్నాను. ఆ యా చిత్రకారులందరికీ ధన్యవాదాలు, నమోవాకాలు.

    ఇది ఎంతవరకు మీకు నచ్చిందో తెలియబరచండి. తక్కినవి కూడా అందుబాటులోకి తెస్తాను.

    భవదీయుడు
    ఎమ్బీయస్ ప్రసాద్
    mbsprasad ఎట్ జీమెయిల్ డాట్ కాం

    జనవరి 01 2012

    Language:
    Comment(s)

    బాగుందండీ. ఇన్నాళ్ళకి కొన్ని కథలు అర్థమయ్యాయి నాకు! బైబిల్ 2 వచ్చిందా? నాకు కనబడలేదే కినిగే సైటులో?