• Sri Suravaram Pratapareddy Gari Jeevitam Rachanalapai Samagra Pariseelana
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 238.8
    598.8
    60.12% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం రచనలపై సమగ్ర పరిశీలన

    Sri Suravaram Pratapareddy Gari Jeevitam Rachanalapai Samagra Pariseelana

    Pages: 332
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా॥ ఇందుర్తి ప్రభాకరరావు గారు పరిశోధించి పరిశ్రమించి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితాన్ని వారి సర్వతోముఖ సాంఫిుక సాహిత్యోద్యమ కృషిని సమగ్రంగా ఆవిష్కరించినారు. శ్రీ ప్రతాపరెడ్డి గారిని గూర్చి వివరంగా వ్రాయడం అతి క్లిష్టమైన కార్యం. ఆనాటి తెలంగాణా రాజకీయ సాంఫిుక చరిత్రను సంపూర్ణంగా అధ్యయనం చేసి ఆకళింపు చేసికుంటేనే తప్ప, శ్రీ రెడ్డి గారిని గూర్చి వ్రాయడం కష్టం. శ్రీ ప్రభాకరరావు గారు చేసిన మహోన్నత కృషి వారు రచించిన పుస్తకంలో ప్రతి పుటలోనూ సాక్షాత్కరిస్తుంది. ప్రథమ ప్రకరణంగా వారు వివరించిన 'చారిత్రక భూమిక' వారి చిత్తశుద్ధికీ, పరిశోధన పరిశ్రమకీ అద్దం పుతుంది. ప్రసన్నమైన శైలిలో స్పష్టంగా, స్వచ్ఛంగా, చారిత్రకాంశాలను పొందుపరచినారు. సాధారణంగా చారిత్రకాంశాలు నిస్సారంగా ఉంటాయి. కాని శ్రీ ప్రభాకరరావు గారి గ్రంథంలో ఆ విషయాలే రసవత్తరంగా, నిక్షేపింపబడి, మనోరంజకమైన కథలాగా పాఠకులను ఆహ్లాదపరుస్తుంది. ఆనాటి ఆంధ్ర దేశ సామాజిక పరిస్థితులు, ప్రత్యేకంగా తెలంగాణా ప్రాంత సమస్యలు సాధికారంగా సప్రమాణంగా వివరింపబడినాయి.

తెలంగాణా ప్రాంత చైతన్యానికి ప్రధానమైన కారణాలు రెండు- గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ. ఈ రెండింటిని గూర్చి శ్రీ ప్రభాకరరావు గారు విశదంగా వ్రాసినారు. ఆ రెండు సామాజికోద్యమాలను శ్రీ రావు గారు తమ గ్రంథంలో ప్రస్తావించి వివరింపకపోయి ఉంటే, చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం విస్మృతమయ్యేది.

శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు రాజకీయ సాంఫిుక సాహిత్య రంగాలలో సముదాత్తమూ సమున్నతమూ ఐన భూమికను పోషించినవారు. డా॥ ప్రభాకరరావు గారు రాజకీయ, సాంఫిుక, సాహిత్య రంగాలతో విశేషమైన పరిచితి కలవారు. అందుకే వారికి శ్రీ రెడ్డి గారి జీవితాన్నీ, సేవా వైవిధ్యాన్ని ఇంత స్పష్టంగా వివరింపగలిగిన శక్తి కలిగింది. అవకాశానికి సమర్థమైన ప్రోత్సాహం లభించినది.

ద్వితీయ ప్రకరణంలో శ్రీ ప్రతాపరెడ్డి గారి వంశచరిత్రనూ, వారి జీవిత సంగ్రహాన్ని పరిచయం చేసినారు. వారి అంతరంగాన్నీ వెలార్చినారు. శ్రీ రెడ్డి గారి విద్యాభ్యాసం, బహుభాషా పాండిత్యం, కవితా నైపుణి, పత్రికా రచన వ్యాసంగం, కవి పండిత మైత్రి, మొదలైన అంశాలు సముచితంగా ప్రస్తావింపబడినాయి. వారి జీవిత చరమాంకాన్ని వర్ణించిన పద్ధతి హృదయాన్ని కదిలిస్తుంది.

శ్రీ రెడ్డి గారి సాహిత్య సేవను గూర్చి తృతీయ ప్రకరణంలో వివరించినారు. శ్రీ రెడ్డి గారి గ్రంథాలనన్నింటినీ తలస్పర్శిగా అధ్యయనం చేసిన విషయం పాఠకులకు స్పష్టమౌతుంది. పత్రికా సంపాదకునిగా, వివిధ వ్యాసరచయితగా శ్రీ రెడ్డి గారు ప్రదర్శించిన ప్రతిభ చతుర్థ ప్రకరణంలో వర్ణింపబడింది. గోలకొండ పత్రిక ఆవిర్భావం, దానితో సంబద్ధమైన సమస్యలు కష్టనష్టాలు మొదలైన విషయాలను వివరిస్తూనే శ్రీ రెడ్డి గారి మహోన్నత వ్యక్తిత్వాన్నీ పరిశోధన పటిమను స్పష్టపరచినారు. తెలంగాణా ప్రాంత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని అధ్యయనం చేయదలచినవారికీ గ్రంథం అత్యంత ప్రధానమైనది.

శ్రీ రెడ్డి గారి జీవిత సాహిత్యాలను ఇంత వివరంగా, నిర్దుష్టంగా పరిశోధనాత్మకంగా పరిచయం చేసిన సమగ్ర గ్రంథం మరొకటి లేదు.

- డా॥ లక్ష్మణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Suravaram Pratapareddy Gari Jeevitam Rachanalapai Samagra Pariseelana