• Bhartruhari Neeti Satakam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భర్తృహరి నీతి శతకం

    Bhartruhari Neeti Satakam

    Publisher: Victory Publishers

    Pages: 88
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంస్కృత సాహిత్యం నుంచి తెలుగు భాషలోకి శతకములు ప్రవేశించినా, తెలుగులో ఈ శాఖ అనేక విలక్షణ పోకలు పోయింది. సుభాషితాలు లేక నీతిని ప్రతిపాదించే గ్రంథాలు సంస్కృత భాషలో అనేకం ఉన్నాయి. తెలుగులో కూడా సంస్కృతంలో ఉన్నట్లుగానే చాలా నీతి గ్రంధాలు వచ్చాయి. అయితే అవి ఎక్కువగా శతకరూపంలోనే ఉన్నాయి. ఈ విధంగా తెలుగులోనికి వచ్చిన గ్రంధాలలో భర్తృహరి సుభాషిత త్రిశతి ఒకటి. సుభాషిత త్రిశతి లేక సుభాషిత రత్నావళి అనేది కావ్యాలలో లఘు కావ్య జాతిలోనివిగా పరిగణింపబడతాయి. ఈ సుభాషిత రత్నావళి కర్త భర్తృహరి అనే మహాకవి. ఆయన ప్రాచీన సంస్కృత భాషా కవులలో ఒకడు. సుభాషిత త్రిశతి అనబడే భర్తృహరి శతకత్రిశతి నీతి, శృంగార, వైరాగ్యములుగా రచింపబడింది.

సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువాదం చేసిన కవులలో ముఖ్యులు ముగ్గురు వారు ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మన అనేవారు. ఏనుగు లక్ష్మణకవి రచించిన సుభాషిత త్రిశతి తెలుగు అనువాదం నేటికీ విస్తృత ప్రచారంలో ఉన్నది.

ఈ కవి సుభాషిత రత్నావళిని యధామూలంగా, మనోహరంగా, ప్రౌఢశైలిలో సందర్భోచిత సముచితశైలిలో, మూలకవి హృదయాన్ని అర్ధం చేసికొని రచించాడని విమర్శకుల అభిప్రాయం. ఈ సుభాషిత త్రిశతిలోని అనేక పద్యాలు పండితులను పామరులను కూడా ఆకర్షించటం చేత విస్తృత ప్రచారం కలిగింది. లక్ష్మణకవి రచించిన ఇతర గ్రంధాల కంటే సుభాషిత త్రిశతి ప్రఖ్యాతి పొందింది. ప్రచారం పొందింది. ప్రస్తుతం సుభాషిత త్రిశతిలోని నీతి శతకం మాత్రమే అర్ధ తాత్పర్యాలతో ఈ ముద్రణ జరుగుతున్నది. ఈ శతకానికి తగిన ఆదరణ అభించగలదని నా ఆశంస.

- శ్రీకంఠుడు ఆవంచ

Preview download free pdf of this Telugu book is available at Bhartruhari Neeti Satakam