• Sri Bhavishya Puranam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ భవిష్య పురాణం

    Sri Bhavishya Puranam

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.

పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

* * *

అష్టాదశ పురాణాలలో తొమ్మిదవది శ్రీ భవిష్య పురాణం. "భవిష్యదక్షిణోజానుః" అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీ మహా విష్ణువు కుడి మోకాలుతో పోల్చి చెప్పబడింది. ఈ పురాణంలో మొత్తం 585 అధ్యాయాలు, 14500 శ్లోకాలున్నాయి. అష్టాదశ పురాణాలలో అన్నిటికన్నా కాస్త విభిన్నంగా ఈ పురాణం చెప్పబడింది. సమాజంలోని అన్ని వర్ణాలవారు భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి సంబంధించిన ఎన్నో మార్గాలని ఈ పురాణం ప్రబోధిస్తుంది.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Bhavishya Puranam