• Tripura Kathalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 144
    180
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • త్రిపుర కథలు

    Tripura Kathalu

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

త్రిపుర కథలు ప్రింట్ బుక్ ఇక్కడ

* * *

సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. ఆ తరువాత 7 కథలు భారతిలో ప్రచురితమయ్యాయి. వీరు రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించి 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు... మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి, పలువురిని త్రిపుర అభిమానులుగా మార్చాయి. ఈ కథలు రెండు ముద్రణలు పొంది పాఠకులని అలరించాయి. ఇప్పుడు కినిగె వీటిని సరికొత్తగా ‘ఈపుస్తకం’గా కనక ప్రసాద్ ముందుమాటతో, సరికొత్త అలంకరణతో, త్రిపుర గారి మాటతో మీ ముందుకు తీసుకువచ్చింది. చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర కథలు.

* * *

భౌతికంగానూ, మానసికంగానూ, ఈ కథల పరిధి చాలా పెద్దది. ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు - ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది.

ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది. అంతకన్న మెచ్చుకోలు ఏముంటుంది? ఒక కథకుడు మరొక కథకుణ్ణి గురించి చెప్పేటప్పుడు.

- పాలగుమ్మి పద్మరాజు

త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి.

ఈ కథల్లోని మాటలు కథను నిర్వహించటం కోసం కథకుడు ప్రణాళిక వేసుకొని మాట్లాడిస్తే అంటున్నట్టు మాట్లాడవు. ఇతివృత్తాన్ని నిర్మించి కథను ముందుకు నడిపించడం కోసం మాట్లాడవు. కథ ఆవరణం అంతా ఆంతరంగికం; కథ నడిచేది లోకంలోనే అయినా దాని అసలు వేదిక పాత్రల మనో రంగమే.

- కనక ప్రసాదు

Preview download free pdf of this Telugu book is available at Tripura Kathalu
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.