-
-
నూట పదహారు మహర్షుల దివ్య చరిత్రలు
Noota Padahaaru Maharshula Divya Charitralu
Publisher: Sree Madhulatha Publications
Pages: 223Language: Telugu
పిల్లలూ! ఈ పుస్తకం ప్రత్యేకంగా మీ గురించే మొదలుపెట్టాను. మనం పుట్టక ముందు ఈ భూమి మీద ఎంతో మంది గొప్పవాళ్ళు పుట్టేశారు కదా! వాళ్లందరూ ఎలా ఉన్నారో తెలుసుకొని మనం కూడా అలాగే గొప్పగా ఉండలంటే మంచి పుస్తకాలు చదవాలన్నమాట. ఇలాంటి మంచి పుస్తకాలు చదవడం వలన మనం చూడలేకపోయిన చాలామంది గురించి చాలా విషయాల గురించి తెలుసుకోగలుగుతాం.
ఈ పుస్తకం మహర్షుల దివ్య కథల గురించి రాస్తున్నానన్నమాట. ఎందుకో తెలుసా? మన పవిత్రమైన భారతదేశంలో మన హిమాలయ పర్వతాల మీద, ఒక్కచోటేమిటి ఎన్నోచోట్ల ఎంతోమంది మహర్షులు తపస్సు చేసి భగవంతుణ్ణి చూసి, మన కోసం భూమి మీదకి ఎన్నోసౌకర్యాలు మనం బ్రతకడానికి తెచ్చారు. ఉదాహరణకి గంగానదిని భగీరథుడు భూమి మీదకి తెచ్చాడని తెల్సుకుని ఉంటారు కదా! అలాగన్నమాట. అంతమంది మహర్షులు గొప్ప తపస్సంపన్నులు ఉన్నప్పుడు మనం కొంతమంది గురించైనా తెలుసుకోవాలి కదా... అందుకే ఈ పుస్తకం చదవండి.
మీకు కళ్ళకి కట్టినట్లు ఋషులు, చరిత్రలు, వాళ్ళ తపస్సులు విద్యలు, నియమనిష్ఠలు, లోకం కోసం చేసిన వాళ్ళు చేసిన గొప్ప పనులు ఇలాంటివి ఎన్నో తెలియచెప్పి ఈ దేశంలో మనం పుట్టినందుకు గర్వపడేందుకు అధికారముందనీ, వాళ్ళ పవిత్రమైన ఆశీర్వచనాలవల్లే ఇంతకుముందు కానీ, ఇప్పుడు కానీ, ఇక మీదటకానీ, ఎప్పటికీ మనదేశం జ్ఞానంతోను, సంపదలతోనూ సస్యశ్యామలంగా, ప్రపంచానికే గర్వకారణంగా వుంది. వుంటుంది కూడా! దీంట్లో ఏ మాత్రం సందేహం లేదనీ చెప్తున్నాను.
- భమిడిపాటి వి. బాలాత్రిపురసుందరి

- ₹432
- ₹216
- ₹216
- ₹72
- ₹108
- ₹64.8