• Yogasanalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యోగాసనాలు

    Yogasanalu

    Publisher: Victory Publishers

    Pages: 84
    Language: Telugu
    Rating
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    '3.25/5' From 4 votes.
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 premium votes.
Description

యోగాసనాలు వేయడం వలన కలిగే లాభాలు అనంతం. ముఖ్యంగా మనోజ్ఞానశక్తి పెంపొందుతుంది. అనేక మానసిక బలహీనతలు తగ్గుతాయి. అలౌకిక దృశ్యాదృశ్య ప్రపంచాన్ని చూడగల శక్తి ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానము కలుగుతుంది. ధైర్యం అలవడుతుంది. దివ్యశక్తులను పొందవచ్చు. పవిత్రత, దివ్యజీవనం, మంచితనం అలవడుతుంది. సమాజశ్రేయస్సుకు పాటు పడగల ధైర్య సాహసాలు అలవడతాయి. సత్యాసత్యాలు తెలుసుకుంటారు. నిస్వార్ధ జీవితం అలవడుతుంది. మనస్సు నిర్మలమవుతుంది. పవిత్ర ఆశ్రమాలు మనసులోకి ప్రవేశిస్తాయి. మానవసేవయే మాధవ సేవ అనే నానుడిని అలవర్చుకుని మహాత్ముడవడానికి ఆస్కారముంటుంది. శాశ్వతమైన పరమాత్మను దర్శించగలుగుతారు. అజ్ఞానాంధకారం నుండి విజ్ఞాన ప్రకాశంలోకి ప్రవేశిస్తారు. అనుకున్నది సాధించగల శక్తిని సమకూర్చుకోగలుగుతారు. మానసిక చింతలు దరిచేరవు. అఖండ శాంతిని పొందుతారు. ప్రాపంచిక ఒత్తిడి నుండి నివారణ పొందుతారు.

ఏకాగ్రత పెరుగుతుంది. క్రమబద్ధమైన ఆలోచనాసరళి ఏర్పడుతుంది. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సృజనాత్మకత, విశ్లేషణ, ఆధ్యాత్మికత అలవడుతాయి. మన శరీరంలో వున్న సర్వరోగములు, రుగ్మతలు మటుమాయమవుతాయి. సరైన వైఖరితో ఏ పని చేసినా జరిగితీరుతుంది. యోగా వలన రక్తపోటు తగ్గుతుంది. గుండెకొట్టుకునే వేగం నియంత్రించబడుతుంది. యోగా స్వయం నియంత్రత నాడీ వ్యవస్థలో సమతుల్యతను పాటింపజేస్తుంది. తలనొప్పి, జలుబు, అజీర్ణం మొదలైన వ్యాధులు దూరమవుతాయి.

ఆందోళన, భయం, ఒత్తిడిల నుండి దూరమౌతారు. ఆత్మనిగ్రహశక్తి పెంపొందుతుంది. తమపై తమకు నమ్మకం ఏర్పడుతుంది. నేను ఏదైనా చేయగలను అనే ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. కోరికలపై, ఇంద్రియాలపై నిగ్రహశక్తి ఏర్పడుతుంది. శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. సృష్టి విచిత్రాలను గురించి తెలుసుకోగలుగుతారు. మన గురించి మనకి తెలియని ఎన్నో విషయాలను యోగా ద్వారా తెలుసుకోవచ్చు.

న్యూ జనరేషన్‌ యాంత్రిక జీవనంలో మనమెంత కోల్పోతున్నామో ఇప్పటికైనా అర్థమైంది కదా ! పైన పేర్కొన్న ప్రయోజనాలే కాక మనం వేసే ప్రతి ఆసనం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరి వాటిని కూడా తెలుసుకోవాలని ఉత్సాహంగా వుంటే చకచకా చదవండి...

Preview download free pdf of this Telugu book is available at Yogasanalu
Comment(s) ...

NAAKU NACHALEDHU. ASALU BOOK A OPEN AVVADAMLEDHU. OKK PDF LEDHU............... NAAKU PDF FORMET KAAVALI ASALU OPEN AVVADAM LEDHU. MALLI ADOBE ID ANI EDHO ADUGUTHUNDHI, NENU 60 RUPES PAY CHESA BUT NOT SATISFIED