• Nannu Preminchina Aparichitudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    120
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నన్ను ప్రేమించిన అపరిచితుడు

    Nannu Preminchina Aparichitudu

    Pages: 254
    Language: Telugu
    Rating
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    '2.67/5' From 3 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

అంజలి సృష్టించిన కొత్త సమస్యతో ఇంట్లో కూడా మనశ్శాంతి కరువై కాసేపు బయట తిరిగొద్దామని కాలినడకనే బయలుదేరాడు సతీష్‌చంద్ర.

అప్పుడే వర్షంపడి వెలవడంతో ప్రకృతి అంతా స్వచ్ఛంగా ఉంది. చెట్ల ఆకులన్నీ శుభ్రమైపోయి కొత్త సోకుని సంతరించుకున్నాయి.

''వానకి తడిసిన చెట్ల ఆకుల్ని మించిన స్వచ్ఛత ఏముంటుంది...? మనుషుల మనసులు కూడ ఇంత స్వచ్ఛంగానూ ఉండాలి...'' ఆలోచిస్తూ నడుస్తున్నాడు సతీష్‌చంద్ర.

ఆ తార్రోడ్డు నున్నగా తాచుపాములా ఒంపులు తిరిగి వుంది.

జనసంచారం తక్కువగా వుంది.

అలా నడుస్తూ వుంటే మనసు ప్రశాంతంగా మారింది.

అపుడు ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి.

మేడమ్‌ గురించి తను అనవసరంగా భయపుతున్నాడు. ఏదో క్రేజినెస్‌తో ఆమె తనని కోరుకుంటోంది.

ఇదంతా కేవలం ఫాసినేషన్‌.

కొన్నాళ్ళకి ఆ మబ్బులు తొలగిపోతాయి.

ఈలోపు తనోసారి చైతన్యతో ఫోన్‌చేసి మాట్లాడితే బెస్ట్‌. వాళ్ళ చెల్లెల్ని వర్క్‌మీద కాన్సంట్రేట్‌ చెయ్యమని చెప్పించాలి. వాళ్ళన్నయ్య మాట తోసిరాజనే మనిషి కాదుకదా...!

మనసు తేలికవడంతో హుషారయ్యాడు.

సన్నగా విజిల్‌ వేస్తూ పేంటు జేబుల్లో చేతులు పెట్టుకుని మెల్లగా నడుస్తున్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Nannu Preminchina Aparichitudu