• Cancerni Jayinchandi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    120
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాన్సర్‌ని జయించండి

    Cancerni Jayinchandi

    Author:

    Pages: 115
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 20 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 15 premium votes.
Description


దేవుడు మనుష్యులని సృష్టించాడు. ఆ మనుష్యులను అర్థాంతరంగా తీసుకెళ్ళడానికి మృత్యువుని సృష్టించాడు. ఆ మృత్యువు కాన్సర్ ను సృష్టించింది.
కాన్సర్ మనుష్యుల మధ్య అనుబంధాలను, ఆనందాలను హరించి విషాదాన్ని మిగిల్చింది. దేవుడు పశ్చాత్తాపపడి డాక్టర్‌ని సృష్టించాడు.
అప్పుడేం జరిగింది?
కాన్సర్‌ని గుర్తించడం ఎలా?
కాన్సర్ బాధితులను ఓదార్చడమెలా?
నెలలో ఒకరోజు యాభై రూపాయల ఖర్చుతో, వంద పోస్టుకార్డులు కాన్సర్ బాధితులకు పోస్ట్ చేస్తే?
కాన్సర్‌తో పోరాడి గెలిచిన వారు, ఓడినవారు, స్ఫూర్తినిచ్చిన వారు. ఎవరెవరు?
మీకు తెలుసా? తలనుండి కాళ్ళ వేళ్ళ వరకు ఏ భాగానికైన వచ్చే కాన్సర్...
100 రకాలకు పైగా ఉన్నాయి.


సుప్రసిద్ధ డాక్టర్, చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ...
ప్రముఖ రచయిత విజయార్కె కలిసి అందిస్తున్న... తొలి ప్రయోజనాత్మక ప్రయోగం "కాన్సర్‌ని జయించండి"

Preview download free pdf of this Telugu book is available at Cancerni Jayinchandi
Comment(s) ...

క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల క్యాన్సర్ కు సంబంధించిన విషయాలు ముందుజాగ్రత్తలు తెలియపోవడం .వల్ల ఎన్నో అనర్థాలు జరగడం చూసాను....క్యాన్సర్ ను ఎలా గుర్తించవచ్చో, క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలా దర్యాన్ని కూడదీసుకుని క్యాన్సర్ ను జయించవచ్చో తెలియజేసే పుస్తకం మొదటిసారి చదివాను.ఈ పుస్తకం నా స్నేహితురాలిని క్యాన్సర్ నుంచి కాపాడింది.ఈ పుస్తకం చదివాకా తన సందేహాన్ని పరీక్షల ద్వారా నివృత్తి చేసుకుంది.సకాలంలో క్యాన్సర్ నుంచి బయటపడింది.ముఖ్యంగా క్యాన్సర్ అని తెలిసినప్పుడు మన ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ ను ఎలా ఎదుర్కోవాలో చెప్పిన విధానం బావుంది. క్యాన్సర్ ను ఎదుర్కొవాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఈ పుస్తకం గైడ్ లా ఉపయోగపడుతుంది.

క్యాన్సర్ అనే పదం వైద్యనిఘంటువులో కనిపించని రోజు రావాలనే మా ఆలోచనకు మీ తోడ్పాటు అందించండి.క్యాన్సర్ అవేర్ నెస్ లో మీరూ భాగస్వాములు కండి. ఈ పుస్తకం క్యాన్సర్ కు సంబంధిన అవగాహనా కలిగిస్తుంది.క్యాన్సర్ ను ముందే గుర్తించేలా చేసింది.క్యాన్సర్ ను ఆత్మవిశ్వాసంతో జయించే ప్రయత్నానికి చేయూతనిస్తుంది.
www.manrobo.com

చాలా విలువైన పుస్తకం.సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకూ క్యాన్సర్ బారిన పడుతున్నారు.క్యాన్సర్ కు సంబంధిన విషయాలు మనల్ని ఆపమత్తులను చేస్తాయి.వ్యశక్తివవికాసాన్ని కూడా జోడించి క్యాన్సర్ ను ఎలా జయించాలో చెప్పడం ముదావహం.వైద్యనిపుణుడితో ( డాక్టర్ మోహనవంశీతో ) అందించిన క్యాన్సర్ సమాచారం ప్రతీఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటుంది.కేన్సర్ నుంచి దూరంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకం చదవాలి. డాక్టర్ మోహనవంశీకి,విజయార్కె గారికి అభినందనలు ..ఇలాంటి ప్రయోగాత్మక పుస్తకాన్ని హెల్త్ అవేర్ నెస్ గా అందించినందుకు ధన్యవాదాలు .

నిరర్థకమైన వాటికోసం కూడా ఎంతో డబ్బు వెచ్చిస్తాం..కానీ మన ఆరోగ్యాన్ని గుర్తించేలా చేసి కాన్సర్ ప్రమాదాన్ని సూచించే విషయాలు వున్న పుస్తకం కోసం కొంత సమయాన్ని వెచ్చించి ఈ పుస్తకాన్ని చదవలేమా? ఒక్కసారి ఆలోచించండి.ఈ పుస్తకం నాకే కాదు మా మిత్రులకు కూడా ఉపయోగపడింది.వారిని ఎలర్ట్ చేసింది.వారి కుటుంబంలో ఒకరికి వున్న క్యాన్సర్ ని ముందే గుర్తించేలా చేసింది.

చాలా యూజ్ ఫుల్ పుస్తకం క్యాన్సర్ ను జయించండి ..అయిదేళ్ల క్రితం అనుకుంటాను..నా స్నేహితురాలికి క్యాన్సర్ అని తెలిసింది..అది కూడా కాకతాళీయంగా..." క్యాన్సర్ ని జయించండి" పుస్తకం అనుకోకుండా నా స్నేహితురాలికి ఇచ్చాను.అది ఓ మూలకు పడేసింది..ఖాళీగా వున్నప్పుడు తిరగేసింది.అది చదివాక వెంటనే హాస్పిటల్ కు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంది.క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించగలిగింది ఆ పుస్తకాన్ని చదవడం వల్ల...ఆ పుస్తకమే " క్యాన్సర్ఒ ని జయించండి "...ఒక చిన్న అవేర్ నెస్ ...ఒక సుప్రసిద్ధ వైద్యనిపుణుడు డాక్టర్ మోహనవంశీ.ఒక ప్రముఖరచయిత ( విజయార్కె ) కలిసి రాసిన ఈ పుస్తకం ఫ్రీ ప్రివ్యూ చదవండి...మన ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎలాగో ఈ పుస్తకమూ అలాగే..అంతకు మించి ఉపయోగపడుతుందని నా నమ్మకం......ఇలాంటి మంచి పుస్తకాలు హెల్త్ అవేర్ నెస్ తో కూడిన పుస్తకాలూ అందిస్తోన్న కినిగె కు థాంక్స్.
మనం ఒక్కరోజు " క్యాన్సర్ అవేర్ నెస్ డే " లు జరుపుకుంటే సరిపోవని నా ఉద్దేశం..అలాగే ఇలాంటి పుస్తకాలు ప్రజల్లోకి వెళ్ళి క్యాన్సర్ గురించిన అవగాహన కలిగించాలి.

క్యాన్సర్ గురించి కనీస అవగాహనకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.ఎన్నో పనికిరాని,మనకు అవసరంలేని,నిరుపయోగమైన విషయాల మీద ఆసక్తి చూపించే మనం ,మన జీవితాన్ని మనకు తెలియకుండానే కబళించే క్యాన్సర్ మహమ్మారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం.
దయచేసి ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకం చదివి క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి.క్యాన్సర్ ను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

ప్రతీరోజు క్యాన్సర్ మరణాలు పత్రికల్లో చూస్తున్నాం.క్యాన్సర్ కు నివారణ ఉందా ? లేదా? అన్న విషయం కన్నా క్యాన్సర్ ను గుర్తించడం,ముందుజాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
కనీసం వందరకాల క్యాన్సర్ ల గురించి తెలుసుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా కలిగింది.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి,క్యాన్సర్ ను గుర్తించి మనం క్యాన్సర్ నుంచి బయటపడడానికి అరవై రూపాయలు వెచ్చించి ఈ పుస్తకాన్ని చదవలేమా?ఆలోచించండి.
మనం ఒక్కరోజు " క్యాన్సర్ అవేర్ నెస్ డే " లు జరుపుకుంటే సరిపోవని నా ఉద్దేశం..అలాగే ఇలాంటి పుస్తకాలు ప్రజల్లోకి వెళ్ళి క్యాన్సర్ గురించిన అవగాహన కలిగించాలి.

"క్యాన్సర్ ని జయించండి చదివాను.చదివినంతసేపు ఏడుస్తూనే వున్నాను.మా సోదరి క్యాన్సర్ తో మరణించారు.పుస్తకంలో రచయిత గారు రాసిన " చిరునవ్వుతో నిష్క్రమించిన పద్మక్క' అధ్యాయం చదువుతున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు.
ఈ పుస్తకం ఒక ఇరవయ్యేళ్ల క్రిందట వచ్చి ఉంటే,నేను చదివి ఉంటే " మా సోదరిని బ్రతికించుకునేవాడినేమో."
కాలక్షేపము కోసం ,పనికిరాని క్షణికానందం కోసం మనం ఎంతో సమయాన్ని,డబ్బును వృథా చేస్తాం.కానీ మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే ,విన్నవించే ఇలాంటి పుస్తకాలను చదివేది ఎంతమంది ?
" దేవుడు మనుష్యులని సృష్టించాడు. ఆ మనుష్యులను అర్థాంతరంగా తీసుకెళ్ళడానికి మృత్యువుని సృష్టించాడు. ఆ మృత్యువు కాన్సర్ ను సృష్టించింది" విజయార్కె గారు రాసిన ఈ వాక్యం నూటికినూరుపాళ్లు నిజం
"తలనుండి కాళ్ళ వేళ్ళ వరకు ఏ భాగానికైన వచ్చే కాన్సర్...100 రకాలకు పైగా ఉన్నాయి."అన్న విషయం ఈ పుస్తకం చదివేవరకూ తెలియదు
ఈ పుస్తకం ఖచ్చితంగా మనకు క్యాన్సర్ పట్ల అవగాహనా కలిగిస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని హెచ్చరిస్తూనే
అంతేకాదు క్యాన్సర్ ను ఎదురించే ధైర్యాన్ని ఇస్తుంది
పుస్తకరచయితలకు శతకోటి ప్రణామాలు
దయచేసి ఏ పుస్తకాన్ని ప్రతీఒక్కరూ చదవండి.ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎలానో ,ఈ పుస్తకం అలా ఆరోగ్యదర్శినిలా ఉపయోగపడుతుంది.
ప్రతీ ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు అయోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది.
"క్యాన్సర్ అనే పదం వైద్య నిఘంటువులో లేని రోజు రావాలని పుస్తకరచయితలు " డాక్టర్ మోహనవంశీ ,విజయార్కె " గార్లు కోరుకున్న రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం.

కాన్సర్ ని జయించిన సోనాలి బింద్రే మాటలు ..
( ఈనాడు సౌజన్యంతో)
ముంబయి: బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జులైలో ఆమె తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్తున్నట్లు తెలిపారు. అక్కడే ఆమెకు కొన్ని నెలలపాటు చికిత్స జరిగింది. అయితే ఈ క్రమంలో ‘చనిపోతానేమో’ అనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని సోనాలి చెప్పారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ‘నా ఉదర భాగంలో క్యాన్సర్‌ కణాలు పూర్తిగా వ్యాపించి ఉన్నాయని స్కాన్‌ ద్వారా తెలిసినప్పుడు, బతికే అవకాశం కేవలం 30 శాతం ఉందని న్యూయార్క్‌ వైద్యులు చెప్పినప్పుడు.. మా గుండె పగిలింది. కానీ చనిపోతాననే ఆలోచన నాకు రాలేదు. పూర్తిగా కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని మాత్రం అర్థమైంది. కానీ ప్రాణాలు పోతాయని మాత్రం ఎప్పుడూ భయపడలేదు’.

‘ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు నా బలం అయ్యారు. ఇప్పుడు నేను నా శరీరంపై ఎక్కువ దృష్టిపెడుతున్నా. చిన్నచిన్న మార్పుల్ని పట్టించుకుంటున్నా. ఇది ఓ కొత్త ప్రయాణం. క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా.. ఎక్కువ జాగ్రత్త అవసరం, సపోర్ట్‌ అవసరం. మీ చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉండేలా చూసుకోండి. ఇది ప్రేమ, అనురాగం పొందాల్సిన సమయం’ అని సోనాలి చెప్పారు.

కాన్సర్ ని జయించిన సోనాలి బింద్రే మాటలు ..
( ఈనాడు సౌజన్యంతో)
ముంబయి: బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జులైలో ఆమె తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్తున్నట్లు తెలిపారు. అక్కడే ఆమెకు కొన్ని నెలలపాటు చికిత్స జరిగింది. అయితే ఈ క్రమంలో ‘చనిపోతానేమో’ అనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని సోనాలి చెప్పారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ‘నా ఉదర భాగంలో క్యాన్సర్‌ కణాలు పూర్తిగా వ్యాపించి ఉన్నాయని స్కాన్‌ ద్వారా తెలిసినప్పుడు, బతికే అవకాశం కేవలం 30 శాతం ఉందని న్యూయార్క్‌ వైద్యులు చెప్పినప్పుడు.. మా గుండె పగిలింది. కానీ చనిపోతాననే ఆలోచన నాకు రాలేదు. పూర్తిగా కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని మాత్రం అర్థమైంది. కానీ ప్రాణాలు పోతాయని మాత్రం ఎప్పుడూ భయపడలేదు’.

‘ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు నా బలం అయ్యారు. ఇప్పుడు నేను నా శరీరంపై ఎక్కువ దృష్టిపెడుతున్నా. చిన్నచిన్న మార్పుల్ని పట్టించుకుంటున్నా. ఇది ఓ కొత్త ప్రయాణం. క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా.. ఎక్కువ జాగ్రత్త అవసరం, సపోర్ట్‌ అవసరం. మీ చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉండేలా చూసుకోండి. ఇది ప్రేమ, అనురాగం పొందాల్సిన సమయం’ అని సోనాలి చెప్పారు.

ఈ పుస్తకం ప్రతీఒక్కరూ చదవాలి.క్యాన్సర్ అవేర్ నెస్ తప్పనిసరి.క్యాన్సర్ ను ఎలా గుర్తించవచ్చో,క్యాన్సర్ ను జయించే ప్రయత్నానికి సపోర్టింగ్ గా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది,

క్యాన్సర్ ని జయించండి ఒక పుస్తకం కాదు,మన జీవితాన్ని మృత్యువు బారినుంచి రక్షించే ఆరోగ్యగీత .
రోజూ ఎన్నో పనికిరాని లేదా నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వని విషయాల మీద సమయాన్ని,డబ్బును ఖర్చు చేస్తున్నాం.
ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదివి క్యాన్సర్ అవేర్ నెస్ గురించి తెలుసుకోండి.ముందు జాగ్రత్తలు తీసుకోండి.
మా బంధువుల్లో కొందరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ తో మరణించారు.
వన్దరకాల క్యాన్సర్ల గురించే కాదు విలువైన వ్యక్తిత్వవికాస పాఠాలు వున్నాయి.
ఈ పుస్తకం మీద వెచ్చించే డబ్బు ఎక్కువేమీ ,ఈ కాదు మన ప్రాణాల కన్నా.

క్యాన్సర్ ని జయించండి హెల్త్ ఎన్సైక్లోపీడియా .ప్రతీ న్తలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లా ఉండాలి.క్యాన్సర్ అవేర్ నెస్ ను అందరం గుర్తించాలి.
కొంత సమయాన్ని చిన్ని మొత్తాన్ని ఈ పుస్తకం కోసం వెచ్చిస్తే ఒక జీవితకాలం, మనం ఆరోగ్యంతో ఉండవచ్చు.

కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు.
రిషికపూర్ తాను ఎదుర్కున్న సవాళ్ల గురించి ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు.
‘గతేడాది దిల్లీలో ఓ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు నేను వైద్య పరీక్షలు చేయించుకున్న ఆస్పత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పుడే నాకు క్యాన్సర్‌ ఉందని తెలిసింది. ఆ తర్వాత తొమ్మిది నెలలుగా న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నాను. జీవితంలో పెను మార్పు చోటుచేసుకున్నట్లు అనిపించింది. చికిత్స మొదలుపెట్టాక 26 కిలోలు తగ్గిపోయాను. నాలుగు నెలల పాటు తిండిలేదు. ఆకలి వేసేది కాదు. ఈ మధ్యనే ఎనిమిది కిలోలు పెరిగాను. ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం మెరుగవుతోంది. ఇంకా చికిత్స జరుగుతోంది. నా ఇంటిని చాలా మిస్సవుతున్నాను. నేను న్యూయార్క్‌లో మరో రెండు నెలలు చికిత్స తీసుకోవాలి. సెప్టెంబర్‌లో నా పుట్టినరోజు. కనీసం అప్పటికైనా నేను నా ఇంటికి చేరుకుంటానని ఆశిస్తున్నాను’ అని వెల్లడించారు రిషి.
క్యాన్సర్ ను ఎదుర్కోండి.క్యాన్సర్ ని జయించండి.మీ విలువైన జీవితాన్ని,అందులో కొంతసమయాన్ని క్యాన్సర్ అవేర్ నెస్ కోసం వెచ్చించండి.
క్యాన్సర్ఫ్రీ ని జయించండి... పిడిఎఫ్ చదివి మీకు ఉపయోగం అనుకుంటే ఈ పుస్తకాన్ని మొత్తం చదవండి.