• Premakala
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 38.4
    48
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమకళ

    Premakala

    Pages: 91
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

స్త్రీ పురుషుల మధ్యన ఉండే ఆకర్షణ, ప్రేమ సహజసిద్ధమైనటువంటివి. వారిరువురికీ ఒకరిపై మరొకరికి ప్రేమ జనించి, ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పటికీ వారు పరస్పరం చేరువవ్వాలంటే ఇరువురూ కొంత ధైర్యాన్నీ, కొంత చాకచక్యాన్నీ ప్రదర్శించాలి. అందుకొరకు వారికి కావలసిన మార్గదర్శకాలను వివరిస్తూ, ప్రాచీన రోమన్ సామ్రాజ్యానికి చెందిన కవి అయిన ఒవిడ్ (Ovid 43 B.C.–A.D. 17) ‘ప్రేమకళ’ అనే ఈ చిరుగ్రంథాన్ని ‘ఆర్స్ అమటోరియా’ (Ars amatoria) పేరుతో, క్రీస్తు పూర్వం 1 లో రచించాడు.

భారతీయ సాహిత్యంలోని వాత్సాయన కామసూత్రాల కంటే కూడా ఒవిడ్ ‘ప్రేమకళ’ విశదంగానూ, ఆచరణాత్మకంగానూ ఉంటుంది.

వాత్సాయనుడు వశీకరణ ప్రకరణంలో ఏవో కొన్ని మందుల్ని, మాకుల్నీ సూచించాడు. అదే సమయంలో ఒవిడ్ వశీకరణ ప్రక్రియనంతా కాలాతీతమైన మానవ స్వభావం ఆధారంగా వివరించాడు.

ఒక స్త్రీని గెలుచుకోవాలని భావించే పురుషుడు చతుష్షష్ఠీ కళాకోవిదుడై ఉండాలని వాత్సాయనుడు చెప్పాడు, కొంచెం శుచీ శుభ్రంగా ఉంటే చాలని ఒవిడ్ చెప్పాడు.

దేశ విదేశాలకు చెందిన స్త్రీలను, వాళ్ళ స్వభావాలనూ వాత్సాయనుడు పేర్కొన్నాడు, నీకు కావాల్సిన సుందరీమణి నీ చుట్టు పక్కలనే ఉంటుందని ఒవిడ్ చెప్పాడు.

వాత్సాయన కామసూత్రాలు వివాహితులు మాత్రమే చదవదగిన ఒక adult content. కానీ ఈ ‘The Art of Love’ విద్యార్థులు అభ్యసించవలసిన ఒక పాఠ్యాంశం.

లాటిన్‌భాషలో, కవితారూపంలో మూడు భాగాలుగా ఉండే ఈ ‘ప్రేమకళ’ గ్రంథంలోకెల్లా ముఖ్యమైనది, ప్రథానమైనది అయిన మొదటిభాగపు తెలుగు అనువాదాన్నే ప్రస్తుతం నేను మీకు అందిస్తున్నాను. రెండువేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ ‘ప్రేమకళ’ నేటి ఆధునిక యుగపు డేటింగ్ మాన్యువల్స్‌ను సైతం నిర్దేశిస్తున్నది.

మీరు సైతం ఈ గ్రంథాన్ని చదివి మీ ప్రేమలో గెలవండి.

- బి.యల్.సరస్వతీ కుమార్

Preview download free pdf of this Telugu book is available at Premakala