• Naimisha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    96
    37.5% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నైమిష

    Naimisha

    Pages: 222
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

తాను బ్రతకాలి. జైలునుంచి తప్పించుకోవాలి. తనకీస్థితిని తెప్పించిన వాళ్ళను సర్వనాశనం చెయ్యాలి. ఆమెలో రక్తం పరవళ్ళు తొక్కుతోంది. ఎలాగయినా ఇక్కడినుంచి పారిపోవాలి. అంతే.

నైమిషకు తెలుసు అదంత సులభం కాదని. ఆమె వున్న గది సెల్లార్‌ ఫ్లోర్‌లో వుది. చాలా విశాలంగా కూడా వుంది. ఇప్పుడు బుద్ధి బలం ఒక్కటే చాలదు. తాను వ్యాయామం చేసి శక్తిని సంపాయిస్తే తప్ప ఇక్కడనుంచి తప్పుకోవడం సాధ్యపడదు. తను చిన్నప్పుడు తై-చి-షువాస్‌, కరాటేలాంటి మార్షల్‌ విద్యల్ని నేర్చుకుంది. కాని ఈ మధ్య ప్రాక్టీస్‌ లేకపోవడంవల్ల శరీరం బలహీనంగా తయారయింది. తాను నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్ పాఠాల్ని నెమరు వేసుకోసాగింది నైమిష. ఆ పట్టుదల రోజురోజుకు ఆమెలో రెట్టింపవుతోంది. చూస్తుండగానే కొద్ది రోజుల్లో తన శరీరంలోని ప్రతి నరాన్ని, ప్రతి కండరాన్ని, తన ఆధీనంలోకి తెచ్చుకొని తన యిష్టమొచ్చిన రీతిలో కదల్చగలగడం సాధించగలిగింది. పాఠాల్ని నెమరువేసుకోవడం, ప్రాక్టీస్‌ చెయ్యడం, తలుపు సందుననుంచి విసిరి వేయబడ్డ రొట్టెల్ని మిగలకుండా తినటం, ఇదే పని నైమిషకు.

శరీరం బాగా అలసిపోయినపుడు మానసికమైన వ్యాయామం చెయ్యసాగింది. తనలో అంతర్గతంగా వున్న శక్తిని బయటకు తీసుకురావడం కోసం అహోరాత్రులు శ్రమించింది. తన శరీరాన్ని శిలలా కఠినంగా మార్చివేసింది. పక్షికన్నా తేలికగా తయారయింది. తన శరీరంలోని ప్రతి కదలికనూ, ప్రతి అవయవంపై అదుపును సంపాదించింది. తన చేతుల్ని ఎంత కఠినంగా తయారు చేసిందంటే ఒకే ఒక పిడికిలి దెబ్బతో బలమైన వ్యక్తి తలను సయితం మధ్యకు పగులగొట్టగలంతగా, ఒకే చేతి విసురుకు ముగ్గుర్ని అవలీలగా నేల కూల్చగలంత కఠినంగా, చిరుతపులిని కూడా మెరుపుదాడిలో ఓడించగలననే ఆత్మవిశ్వాసాన్ని ఆమె సాధించింది.

Preview download free pdf of this Telugu book is available at Naimisha
Comment(s) ...

Parama Chetta Novel. Didn't expect such a worst narration of a story by this writer. Quite disappointed.