-
-
చంద్రహాసం
Chandrahasam
Author: Satish Chandar
Publisher: Smiles and Smiles Media Pvt. Ltd.
Pages: 256Language: Telugu
Description
'చంద్రహాసం' నవ్వుల దిక్సూచి.
అలిగి వెళ్లిన నవ్వును బుజ్జగించి తెచ్చుకోవటం నేర్పుతుంది.
ఈ పుస్తకం చదివాక, పాఠకుడు నవ్వుకోసం ఎంతపనయినా చేస్తాడు.
ఒక్క నవ్వుకోసం వెయ్యినొక్క యుధ్ధాలకు సిధ్ధమవుతాడు.
చదువుతున్నప్పుడు-
మీరు నవ్వుకుంటారు.
పుస్తకం మూసేశాక కూడ-
మీలో మీరు నవ్వుకుంటారు.
నవ్వుకుని తేరుకున్నాక,
'ఎందుకలా నవ్వుతున్నావ్' అన్న వారిని ఎడతెరపి లేకుండా నవ్విస్తారు.
అడక్కుండా వెయ్యికోట్ల రూపాయిల అప్పును ఉదారంగా యిచ్చే ప్రపంచబ్యాంకును-
ఒక్క నవ్వుని... ఒకే ఒక్క నవ్వుని రుణంగా ఇస్తుందేమో అడిగి చూడండి.
ఎంత గింజుకున్నా ఇవ్వలేదు.
కానీ సతీష్‌చందర్ లాంటి వ్యంగ్యరచయిత ఇస్తారు.
ఇవ్వటమేమిటి? ఇచ్చారు. అప్పుగానే.
అదే 'చంద్రహాసం'
స్వీకరించండి. ఇక చదవండి.
- ప్రచురణ కర్తలు
Preview download free pdf of this Telugu book is available at Chandrahasam
Login to add a comment
Subscribe to latest comments
