-
-
మిసిమి జులై 2011
Misimi July 2011
Author: Misimi
Publisher: Bapanna Alapati
Language: Telugu
నటరాజ రామకృష్ణ అనే వ్యక్తి పుట్టకపోతే మన నాట్యరీతులు - ముఖ్యంగా ఆలయ నృత్యాలు, లాస్య సంప్రదాయానికి చెందిన నాట్యము, తాండవ సంప్రదాయానికి చెందిన పేరిణి - వీటికి వ్యాకరణము - రూప విన్యాసాలు అక్షరబద్ధమయ్యేవి కావేమో. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి నాట్యాన్నే ఆరాధించి, చివరి శ్వాసవరకూ ఆ కళకే సేవచేసిన కారణ జన్ముడు, సౌమ్యుడు రామకృష్ణ అస్తమయంతో ఒక శకం ముగిసింది. వీరు 47 గ్రంథాలు వ్రాశారంటే నమ్మలేరేమో. వాటినన్నిటినీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.
తయ్యబ్ మెహతా, రజా, సౌజా, సతీష్ గుజ్రాల్ లాంటి దిగ్గజాల సరసన చేరిన హుస్సేన్ ఇంటికి తిరిగి రాలేక ఎక్కడో తనువు చాలించడం భారతీయులకు విచారకరమైన విషయమే. ఆయనకు నివాళిగా కొన్ని చిత్రాలు ముద్రిస్తున్నాం.
'యానాం చరిత్ర' ఎంతటి కల్లోలమయిందో - కరువు రక్కసి ఎంతటి దారుణాలు చేస్తుందో తెలుసుకుంటే ద్రవించి పోతాము.
ఎన్నో జానపద కళల్లో 'దొమ్మరాట' ఒకటి - దీనిని కేవలం పొట్టకూటికే ఆశ్రయించి - ప్రాణాలకు తెగించి ఇప్పటికీ రహదారుల ప్రక్కన చిన్నారులు - కన్న తల్లులు కూడా ప్రదర్శించటం సమాజ రుగ్మతలలో ఒకటే కాని - ఇది కళా పోషణ కాదు.
ఒక ఊరికి పేరు ఎవరు పెడతారు? అది ఆ విధంగా ఎందుకు ప్రచారం పొందుతుంది? దీని గురించి విశ్వవిద్యాలయాల్లో 'నామ విజ్ఞానం' (Onamastics) ఒక శాఖే వున్నది. ఇది ఒక పరిశోధనే.
మిసిమి కి ఎప్పటినుంచో అనేక వ్యాసాలు వ్రాసిన ఉమ్మడిశెట్టి శివలింగం ఇక లేరని తెలియచేయటానికి విచారిస్తున్నాం.
