• Time Bomb
  • Ebook Hide Help
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టైమ్ బాంబ్

    Time Bomb

    Author:

    Pages: 373
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“అదిగో... వేదికమీద సభా అధ్యక్షుడుగా కూర్చున్నాడే పెద్దమనిషి, హోంమినిస్టర్ మాధవరావు షిండే... వాడికి పెట్టాను టైమ్ బాంబ్... సరిగ్గా పదినిముషాల తర్వాత తునాతునకలుగా పేలిపోతాడు. వాడితో బాటు వేదికమీది విమల్‍ఘోష్, మిగిలిన పెద్దలు అంతా చస్తారు...” అంటూ క్రూరంగా నవ్వాడు.

“మైగాడ్!” అప్రయత్నంగా శ్యామ్‍సుందర్ పెదవుల నుంచి వెలువడిన మాటలు అవి. ఆవేశం ఆపుకోలేక-

“యూ బ్లడీ రాస్కెల్...” అంటూ పిడికిలి బిగించి ముఖంమీద గుద్దాడు.

దెబ్బ పడి వుంటే వాడి ముఖం పచ్చడై వుండేది. చివరి క్షణంలో వెనక్కి దూకి వరండా చివరగా వున్న ఎలివేటర్ దిశగా పరుగు ఆరంభించాడు.

అదే సమయంలో అక్కడికి చేరుకున్నాడు వాత్సవ.

“ఏమైంది?” అనడిగాడు వస్తూనే.

“వాడు తాజుద్దీన్. వాడ్ని నేను పట్టుకుంటాను. టైం లేదు. వాడు మన హోం మినిస్టర్‍గారికి టైం బాంబ్ పెట్టానంటున్నాడు. పదినిముషాలే వ్యవధి వుంది. హరియప్... చెకప్ దేర్...” అంటూ విషయం చెప్పేసి క్షణం కూడా ఆగకుండా తాజుద్దీన్ కోసం పరుగుతీసాడు శ్యామ్‍సుందర్.

ఆ మాటలు వింటూనే వాత్సవ అదిరిపడ్డాదు. అరచేతులు చెమటలు పట్టేసాయి. టైమ్ బాంబ్ పేలితే హోం మినిష్టరే కాదు, వేదికమీది పెద్దలంతా తుడిచిపెట్టుకుపోతారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా లోనకు పరుగెత్తాడు.

Preview download free pdf of this Telugu book is available at Time Bomb