• Srusshti samanvayam Krama sikshana
 • Ebook Help
  ₹ 30 for 30 days
  ₹ 135
  150
  10% discount
  Print Book Help
  ₹ 135.00
  150
  10% discount
  Expected delivery days: 5
  Eligible for minimum shipping
  A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
  • fb
  • Share on Google+
  • Pin it!
 • సృష్టి సమన్వయం - క్రమశిక్షణ

  Srusshti samanvayam Krama sikshana

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుత విద్యా విధానం విలువల్ని పెంపొందించడంలో విఫలమైంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించదు. అది పూర్తిగా వ్యక్తిని తిరోగమన మార్గంలో నడుపుతుంది. పిల్లవాడు పాఠశాలకు వెళ్ళిన ప్రారంభ దశలోనే మొదట తండ్రి బుద్దిహీనుడనీ, ఉపాద్యాయులందరూ వంచకులనీ, పవిత్ర గ్రంధాలన్నీ అసత్యాలనే నేర్చుకుంటాడు. పిల్లవాడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి నిరాశావాదిగా, అచేతనుడిగా, పిరికి పందగా రూపొందుతాడు' అన్నారు స్వామీ వివేకానంద.

నేటి సమాజంలో విజయం సాధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ విలువలతో కూడిన వ్యక్తుల జాబితా మాత్రం వేళ్ళతో లెక్కించగల సంఖ్యకే పరిమితమైంది. అందుకే 'విజయవంతమైన వ్యక్తిగా ఎదగడం కన్నా, విలువగల వ్యక్తిగా మారటం ముఖ్యం. విజయానికి కావలసింది కేవలం మేధ! కానీ విలువవున్న వ్యక్తిగా మారాలంటే కావలసింది-శీలం' అంటారు ఐన్‌స్టీన్.

వ్యతిరేక భావాల్ని తరచూ వినడం వల్ల మంచి మనస్సు ఉన్నవారు కూడా మారి చెడ్డవారవుతారు. పెద్దల పట్ల వినయవిధేయతల్ని, ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం కలిగి ఉండేలా, తాము నిజమని నమ్మిన దానికి ఎలాంటి పరిస్థితిలోనైనా కట్టుబడి ఉండేలా మనఃస్థైర్యాన్ని పెంపొదిస్తూ తల్లి దండ్రులు పిల్లలకు తగిన శిక్షణనివ్వాలి.

'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' అంటే 'కన్నతల్లి, కన్ననేల స్వర్గం కంటే ఎంతో గొప్పవి' అని శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటాడు. ముందుగా ప్రతి ఒక్కరికి తల్లి, తండ్రి, గురువు, దేశం యొక్క ఉన్నత విలువల్ని తెలుసుకుని గౌరవం ఏర్పడితేనే వినయవిధేయతలు, విలువలు పాటిస్తారు.

సాక్షాత్తు ఆ భగవంతుడే మెచ్చి, ముచ్చటపడి అవతారం దాల్చిన ధన్యభూమి భారతావని. భౌతిక సుఖాలతో, భోగభాగ్యాలతో విలసిల్లుతూ ఆధునికతతో ఎంతోముందున్నాయనుకుంటున్న దేశాలు ఉనికి కూడా లేని వేల ఏళ్ళ క్రితమే, నవీన నాగరికత ఛాయలు ఉట్టిపడిన యోగభూమి మనది. గణితం నుంచి గగన ప్రయోగాల వరకు సమస్త రంగాలకు మన పరమపావన భారతావనే తొలి పాఠశాల. కాని దురదృష్టవ శాత్తూ ఈ తరం జాతి వారసత్వ వైభవాన్ని విస్మరిస్తోంది. అమ్మపెట్టిన ఆవకాయ మరచి పొరుగింటి పుల్లకూర కోసం అర్రులు చాస్తోంది.

జర్మన్ కవి, రచయిత హెర్మన్‌‌మెస్సే 'భారతదేశం ప్రపంచపటంలోని ఒక భౌగోళిక పరమైన ఉనికి మాత్రమే కాదు. యావత్ ప్రపంచానికీ, మానవాళికీ దిశానిర్దేశం చేసిన చారత్రక వారసత్వం పుణికి పుచ్చుకున్న నేల ఇది' అన్నారు. బహుభాషా కోవిదులు, పండితులు పీ. వీ. నరసింహారావుగారు 'మానవ జీవన వ్యవస్థకు ప్రణాళికాబద్ధమైన విధివిధానాలను కూడా నిర్థేశించిన కర్మభూమి మనది. వ్యక్తి కర్మానుసారంగా వర్ణవ్యవస్థను రూపకల్పన చేసిన దేశం మనదే' అన్నారు. స్వధర్మాన్ని అనుసరించడం మేలుచేస్తుంది. తమ తమ స్వభావాలకు, స్వధర్మాలకు సరిపోలని వృత్తి వ్యవహారాలతో తలమునకలై చాలామంది చేతులు కాల్చుకుంటున్నారు.

ఈ గ్రంథంలో వేదాలు, ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు, 5000 వేల ఏళ్ళ క్రితం నుంచి భారతదేశ విశేషాలు, శాస్త్రవేత్తలు, మంత్రాలు, పునర్జన్మలు, విశ్వాంతరాళం, సృష్టి వివరాలు, మానవజన్మ, క్రమశిక్షణతో పెంచుట, క్రమశిక్షణ ఏర్పరుచుకునే విధానాల ఆధారాలతో తెలుపబడినవి. ఇది చదివినవారు మానసికంగాను, జీవితంలోని విలువలు పెంచుకుని లాభపడతారని ఆశిస్తున్నాను.