• timmamaaMba
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తిమ్మమాంబ

    timmamaaMba

    Publisher: Sai Publications

    Pages: 184
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బుక్కపట్టణం ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తూ వుంది. ప్రజలు సరిగా తిండిలేక బక్కచిక్కిపోయారు. పశువులు మేతలేక కళేబరాలుగా మిగిలాయి

సంస్థానాధీశుడు వెంకటరాయలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి, సేనాధిపతి, కొంతమంది ఊరిపెద్దలు, పూజారి ఆంజనేయ శాస్త్రి సమావేశంలో పాల్గొన్నారు.

"మంత్రిగారు! మన కరువు సహాయక చర్యలు సవ్యంగా జరుగుతున్నాయా?" ప్రశ్నించాడు వెంకటరాయలు గారు.

మహారాజ! గంజికేంద్రాలు, చలివేంద్రాలు చక్కగా నిర్వహించబడుతున్నాయి. అయితే...." ఆపేశాడు.

"ఏమిటి మంత్రిగారు! ఆపేశారు పూర్తిచేయండి".

"ఏమని చెప్పమంటారు మహారాజ! మనం ఏర్పాటు చేసిన భోజన సౌకర్యాలు చాలవన్నట్లు వారు ఆకలికి తాళలేక కలబందగడ్డలు తింటున్నారు".

అవునా! కోశాధికారి ధర్మన్నా! మన ఖజానా సంగతేమిటి?"

"పెనుగొండ రాయలవారి నుండి వచ్చిన ధనధాన్య సహాయం, గూటి బయలు నుండి గంగరాజుల వారు పంపించిన ధాన్యం చాలావరకు ఖర్చయిపోయింది. మహారాజ! అతి జాగ్రత్తగా వాటిని వినియోగిస్తున్నాం. త్వరలోనే......."

Preview download free pdf of this Telugu book is available at timmamaaMba
Comment(s) ...

ఈ పుస్తకంపై డా. వి. ఆర్. రాసాని గారి అభిప్రాయము:
"రాయలసీమ జీవితవిధానంలో ఒక ప్రత్యేకత ఉన్నట్లే, ఇక్కడి సంస్కృతి, సాహిత్యరంగంలోనూ ఒక ప్రత్యేకత కలిగివుంది. తెలుగులో మొదటి నవల పుట్టింది ఈ గడ్డపైనే. అది రంగరాజ చరిత్రము, రచయిత కర్నూలు నివాసి అయిన నరహరి గోపాలకృష్ణ. ఈ కోవలో వెలువడిన మరో చారిత్రక నవల బాలగొండ ఆంజనేయులు గారు వ్రాసిన 'తిమ్మమాంబ'. ఈ నవల ఆద్యంతము ఆసక్తిగా సాగి ఎన్నో చారిత్రక అంశాలతోబాటు ఆధ్యాత్మిక అంశాలు జతచేయబడి పాఠకుల్ని విస్మయపరిచే శైలిలో రచయిత ప్రతిభను చాటిచెబుతాయి. చారిత్రక నవలలు కరువైన ఈ రోజుల్లో ఒక చారిత్రక నవలను అందించినందుకు రచయితను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను."

ఈ పుస్తకంపై చారిత్రక నవలా చక్రవర్తి ప్రొ. ముదిగొండ శివప్రసాద్ గారి అభిప్రాయము:
"రాయలసీమ రత్నం శ్రీ బాలగొండ ఆంజనేయులు గారు, ప్రస్తుతము చారిత్రక నవల రచించారు. ఇందలి మర్రిమాను నేటికీ సజీవంగా ఉంది. దీని వెనుకగల కథ రాయలసీమలో అందరికీ సుపరిచితమే. ఇదొక చారిత్రకాంశం. దీనిని తిమ్మమ్మ మర్రిమాను అనే పేరుతో బుర్రకథగా లోగడ రచించడం జరిగింది. నేనా కథ హైదరాబాదులో విన్నాను. చారిత్రక నవలా రచన సులభం కాదు. అదొక యోగం. ఒక యాగం. రచయిత పరకాయ ప్రవేశం చేసి కథాకాలంలోకి వెళ్ళారు. రచయిత సరళమై జనసామాన్యానికి అందుబాటులో ఉండేలా వాక్యనిర్మాణంతో రచన సాగించారు. సందర్భోచితంగా అలంకారాలు ప్రయోగించారు. ఇందలి ప్రధాన పాత్రలు మన కంటతడి పెట్టిస్తాయి. అంటే రచనలో రసార్ధ్రత ఉంది."