జాషువా - సాహిత్యం (దృక్పథం - పరిణామం)
జాషువాపై ప్రముఖుల అభిప్రాయాలు
“ఎంత దూరమో? యెందుల కెవరు? జాషు
వా, యనకవి ప్రవరుడు కవనమునందు
వాని బోలెడు వారె యెవ్వారలేని?
విప్ర కవులందు నెవ్వరో వేత్తదక్క”
...... నితరులేమన్న నాకేమి లెక్క?”
శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
శతావధాని, ప్రథమాంధ్ర ఆస్థానకవి
“శ్రీ జాషువాగారు ఆనాటికీ ఈనాటికీ సాటిలేని మహాకవి. ఆయన కవిత్వం చెక్కుచెదరని, మొక్కవోని చక్కదనం సంతరించుకున్నది.ఆయన తెలుగు పద్యానికి ఒక హృద్యమైన శైలి సంతరించారు. ఆయన వాణి నిత్య కళ్యాణి. ఆయన బాణి అనన్య సామాన్యమైనది. ఆయన లేఖిని అమృతవాహిని”
- కరుణశ్రీ
“జాషువా కరుణరసంలోంచి వీరరసాన్ని పొంగించిన కవి, అతడు చిందించే కన్నీళ్ళు అగ్నిగోళాలు. అవి దేబరించేవి కావు. గూబలను గుద్ది పలకరించేవి?” - పద్మభూషణ్ డా|| సి. నారాయణరెడ్డి
“అపారమైన కవితాశక్తితో, సరళ సుందరమైన భాషను వాడి జాషువా వలె తెలుగు వారి గుండెలను దోచుకున్న కవులు నవీనాంధ్ర సాహిత్య ప్రపంచమున ఎందరో లేరు”
- నాగళ్ల గురుప్రసాదరావు
“ఆధునికాంధ్ర కవితా ప్రపంచంలో జాషువాగారు తనకుతానే సాటి. భావోద్వేగంలో, శైలిలో ఆయనను మరొకరితో పోల్చలేము. ఆ ధార మరెవ్వరికి అబ్బేది కాదు.
- కొంగర జగ్గయ్య
“జాషువా ప్రభావం చాలామంది కవుల మీద పడింది. కాని ఆయన మీద ప్రత్యేకించి ఏ కవి ప్రభావం అంతగా పడినట్లు లేదు”
- సంజీవ్‌దేవ్
- ₹ 30 Gift a Rent
- ₹ 90 Gift an Ebook

