-
-
కిల్లర్స్ గాంగ్
Killers Gang
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 165Language: Telugu
"బంగ్లాదేశ్ని ఏవిధంగా సముద్రంలో కలుపుతానని టైగర్ జాన్ మమ్మల్ని బెదిరించాడో మాకు అర్థం కాలేదు. ఆటంబాంబు వంటి ఆయుధాల్ని అతను సిద్ధం చేసుకున్నాడేమో తెలుసు కోవటానికి మేము చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి... ఏ బలం చూసుకుని అతను ఈవిధంగా సవాలు చేస్తున్నాడో తెలుసుకోకుండా అతన్ని మట్టుబెట్టటానికి ప్రయత్నిస్తే ఫలితాలు చాలా బాధాకరంగా వుంటాయనే అనుమానంతో మేము తటపటాయిస్తూ వుండగా, మా అదృష్టం కొద్ది నువ్వు ఈ పట్టణంలోకి వచ్చినట్లు తెలిసింది.
"ఢాకా సిటీలో చాలా పెద్ద మనిషిగా చెలామణీ అవుతూ ఎవరికీ తెలియకుండా ఈ విద్రోహచర్యల్ని కొనసాగిస్తున్న టైగర్ జాన్ని నువ్వు ఆపాలి మిస్టర్ షాడో. బంగ్లాదేశ్ని అతను సమూలంగా సముద్రంలో కలుపుతానని బెదిరించటం వెనుక వున్న రహస్యాన్ని తెలుసుకుని అతని పీచం అణచాలి"
"నీకు ఎటువంటి సహాయం కావాలన్నా గాంగ్ చేస్తుంది. ఎంతమంది అసిస్టెంట్స్ కావాలన్నా సిద్ధం చేస్తుంది... వెంటనే ఢాకాసిటీకి వెళ్ళి టైగర్ జాన్ ఆటకట్టించాలి... కెన్ యూ డూ దిస్ మిస్టర్ షాడో??"
దూరంగా పెట్టిన హుక్కా గొట్టాన్ని తిరిగి అందుకుంటూ అడిగాడు సీనియర్ సభ్యుడు.
