• Megha Sandesamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మేఘ సందేశము

    Megha Sandesamu

    Publisher: Desineni Anjaneyulu

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
Desineni

తెలుగు అనువాదము: కీ. శే. దేశినేని వేంకట్రామయ్య




వేంకట్రామయ్యగారు 1922 నుండి 1981 దాకా రచనలు చేశారు. వాటిలో స్వతంత్ర రచనలు, అనువాద రచనలు రెండూ ఉన్నాయి. వాటిలో కాళిదాస మహాకవి విరచిత 'మేఘసందేశము' అనువాదము ఒకటి.

దేశినేనివారు స్వతంత్రరచనలోను, అనువాద రచనలోను ప్రతిభ చూపెట్టినారు. ఆధ్యాత్మిక జీవనానికి అలవాటు పడ్డ వీరు ఏ రచన చేసినా దానికి పారమార్థిక పరిమళాన్ని అద్దినారు.

కాళిదాస కుమార సంభవం, ఋతు సంహారం కావ్యాలను అనువదించిన దేశినేనివారు 'మేఘ సందేశ' కావ్యాన్ని కూడ ఉదాత్తంగా తెనిగించినారు. పైగా ఈ కావ్యాన్ని వచనంలేకుండ సంపూర్ణంగా పద్యకావ్యంగా మలచినారు.

యక్షుడు మేఘునితో చిత్రకూట పర్వతం మీద కాసేపు సేదదీర్చుకొని వెళ్లుమని చెప్పు సందర్భంలోని పద్యం ఎంత చక్కగా సాగిందో గమనించండి.


చ. జగదభిరామమూర్తి యగు| జానకి జాని పదాంక సంగతిన్‌
నగణిత పుణ్యమూర్తి యగు| టట్టుల నుండగ స్వస్వ భావతన్‌
మిగిలిన మేట నౌట గని| మేల్భళియంచును సంతసించునా
నగకుల చిత్రకూట మభి| నందిత సంగత మంది పొమ్మికన్‌

దేశినేనివారు సంస్కృతాంధ్ర భాషాకోవిదుడు కనుకనే కాళిదాసు శ్లోకాలకు సరిజోడనే విధంగా పద్యరచన చేశాడు. ఎక్కడ ఆంధ్రీకరణలో ఇబ్బంది కలుగదు. లలిత లలిత పదాలతో అల్లిన సుమధుర సందేశ కావ్యమిది.

- ఆచార్య మసన చెన్నప్ప

Preview download free pdf of this Telugu book is available at Megha Sandesamu