• Parvatee parameswara kalyanamu
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 54
    60
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పార్వతీ పరమేశ్వర కళ్యాణము

    Parvatee parameswara kalyanamu

    Author:

    Pages: 51
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రూప లావణ్యాన్ని, శబ్ధ మాధుర్యాన్ని తనలో ఇముడ్చుకున్న తెలుగక్షరం ఎందరో కవులు, రచయితల చేతుల వెంబడి పరుగులెత్తి రసరమ్య కావ్యాలు, కవితలు, కథల రూపంలో తెలుగు వారి ఇళ్లలో, హృదయాలలో నిలిచిపోయింది. కాల ప్రవాహంలో పద్యం తన గమన వేగాన్ని కోల్పోతే, కవితలు, కథలు తమ వేగాన్ని పెంచాయి. దీనికి ఉన్న అనేక కారణాలలో ఒకటి.. పలకడానికి కష్టంగా ఉండే కఠిన పద ప్రయోగాలు. అయితే దీనికి పోతనగారి భాగవతం వంటి రచనలు మినహాయింపు. భాషలో సరళత, శైలిలో సౌందర్యం భాగవత పద్యాలను మన నాలుకలపై నాట్యం చేసేలా చేసాయి. అలా సరళమైన శైలిలో పద్య రచన చేయాలన్న కోరిక, భగవంతుని పైనున్న భక్తి ,తెలుగు భాషపై అనురక్తి కలగలసి ‘పార్వతీపరమేశ్వర కళ్యాణ’మనే పద్యరచనగా రూపాన్ని సంతరించుకున్నది. మచ్చుకు కొన్ని పద్యాలు:

తారకాసురుని సంహరించగలిగే కుమారునికి జన్మనివ్వడానికి భూమిపై అవతరించమని దేవతలు జగదంబను శరణువేడే సందర్భంలోని పద్యం:


క.
రక్షింపుము సర్వాత్మిక
వీక్షింపుము జగములగతి వేల్పుల గతియున్
శిక్షింపగ నసురపతిని
దక్షుండగు సుతునిగనుము ధరణిన కొలువై!

అలాగే, కళ్యాణం జరిగిన తరువాత అనసూయ, అరుంధతులు పార్వతీదేవికి పతివ్రతా ధర్మాలను బోధించే సందర్భంలో చెప్పి పద్యం:
క.
పతివచనము శ్రుతివచనము
పతిపదములు పరమపదము పతియే గురుడౌ
పతినగవే పరమ సుఖము
పతినడచిన బాట నడువు పర్వత పుత్రీ!

గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు. ఛందస్సు పాఠాలని, వాకరణ సూత్రాలని నేను ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. విశ్వగురుడగు ఆ విశ్వేశ్వరుడినే గురువుగా హృదయంలో నిలుపుకొని వ్యాకరణ, ఛందస్సు పుస్తకాల సహాయంతో రచన చేసాను. అందుకే తప్పులను మన్నించి, దోషాలను సరిదిద్దమని ఆ పరమశివుని వేడుకుంటూ వ్రాసిన ఈ క్రింది తేటగీతి పద్యమే ఈ కథకు ముగింపు.

తే.
హాయి గొలుపగ నీదు కళ్యాణ కథను
వ్రాసితిని కవనముగ నేపరవశమున
వ్యాకరణమందునా పసివాడనోయి
తీరికగ దోషములు సరిదిద్ద వోయి

- పెట్ల త్రిసత్యకామరాజన్

Preview download free pdf of this Telugu book is available at Parvatee parameswara kalyanamu