• Mithunam
 • Ebook Hide Help
  Buy eBook Buy eBook with coupon
  ₹ 30 for 30 days
  ₹ 54
  60
  10% discount
  Print Book Help
  Out of stock
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మిథునం

  Mithunam

  Author:

  Publisher: Navodaya Publishers

  Pages: 150
  Language: Telugu
  Rating
  4.90 Star Rating: Recommended
  4.90 Star Rating: Recommended
  4.90 Star Rating: Recommended
  4.90 Star Rating: Recommended
  4.90 Star Rating: Recommended
  '4.90/5' From 10 votes.
  4.88 Star Rating: Recommended
  4.88 Star Rating: Recommended
  4.88 Star Rating: Recommended
  4.88 Star Rating: Recommended
  4.88 Star Rating: Recommended
  '4.88/5' From 8 premium votes.
Description

అప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్లు ఓమూల పొందికగా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి, మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి.

ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి "-ఏంచేస్తావే ఇన్ని కట్టెలూ...?"అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ.

ఆవిడ చురుక్కున ఒక చూపు చూసి"రేపు నువ్వు హరీ అంటే చితిపేర్చడానికి కావద్దూ..." అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ- ఆయన ఏమాత్రం చలించకపోగా ఫెళఫెళా నవ్వి -"హసి నీ దుంపతెగా- నీకెంతముందు చూపే ముసలి ఘటమా..." అని అటుగా వెళ్తున్న నన్ను పిలిచి "చూశావురా-మీ అత్తయ్య పాతివ్రత్యం! సతీ సహగమనానికి సిద్ధమవుతోంది వెర్రి మొహంది- లేకపోతే యీ ఒక్క కట్టెకి యిన్ని కట్టెలు కావాలిట్రా...?" అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ- ఆ మాటకు నాకూ నవ్వొచ్చింది. ఆవిడ పటపటా లేని పళ్లు కొరకబోయి పెదాలతో నాలిక్కరుచుకుంది. ఖోపంగా మెటికలు విరిచి అవీ కటకటమనకపోతే ఉక్రోషం ఆపుకోలేక "అబ్బో! సరసాలకేం తక్కువలేదు. బోడి చమత్కారాలకి మాత్రం లోటు లేదు... ఒక నగనా- ఒక నట్రనా -కాపరానికొచ్చి అరవయ్యేళ్ళు అయింది. ఒక ముచ్చటా అచ్చటా-ఒక రొచ్చారనా ఒకరు పోయారనా- ఒక తీర్థమా ఒక శార్థమా-" ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది.
....

Preview download free pdf of this Telugu book is available at Mithunam
Comment(s) ...

కినిగె వారు పాఠకులకు మిథునం పుస్తకం గురించి సరైన సమాచారం ఇవ్వటం లేదు. ఇన్నాళ్ళూ నేను ఇది ఒక్క మిథునం కథే అనుకుని కొనలేదు. సినిమా చూసేశాం, ఇంటర్నెట్లో దొరుకుతున్న పి డి ఎఫ్ ఫైలు చదివేశాము కాబట్టి ఈ పుస్తకం ఎందుకు అని నా భావన. కాని కొద్ది రోజుల క్రితం, కినిగె వారి వద్ద ఉన్నా నా డబ్బులు పూర్తిగా సున్నా చుట్టెయ్యటానికి ప్రయత్నిస్తూ ఈ మిధునం పుస్తకం, చదివినా సరే మన దగ్గర ఉండాల్సిన పుస్తకం, మరొకసారి ప్రింటులో ఎప్పుడైనా చదువుకోవచ్చు అని ఇతర పుస్తకాలతోపాటు బాలెన్సు సరిపెట్టటానికి కొనేశాను. తీరా బండిల్ నాకు అందిన అద్భుత క్షణంలో (నేను ఆర్డర్ చేసిన నిమిషం నుంచి ఆ పుస్తకాల పాకెట్ అందేవరకూ ఆతృతే, అంది పుఇస్తకాలు చూసుకునేవి అమృత క్షణాలు) ముందుగా మిథునమే చేతిలోకి వచ్చింది. చూద్దును కదా! అబ్బా ఎన్నెన్ని కథలు, మిథునం ఎక్కడో చివరలో ఉన్నది. మొదటి నుంచి చివర దాకా ఏడు కథలు ఉన్నాయి. అన్నీ కూడా మిథునం అంత గొప్పవే. ముఖ్యంగా బంగారు మురుగులు.

ఈ పుస్తకంలో ఇన్ని కథలున్నాయని, కినిగె వారు ఎక్కడా వ్రాయలేదు. ఇది అన్యాయం అనిపించింది. ఇది ఒక కథా సంకలమనీ, ఇందులో మొత్తం 8 కథలున్నాయని వ్రాయాలి. తెలియని నా వంటి పామరులకు తెలియాల్సిన అవసరం ఉన్నది కదా. మిథునం కాకుండా ఇంకా ఏడు కథలున్నాయని తెలిస్తే ఎప్పుడో కొనేవాణ్ణి ఈ పుస్తకం. నావంటి వాళ్ళు (పుస్తకం ఖరీదు, ఇందులో ఎన్ని కథలు అని తూకం వేసి కొనే సజ్జు) ఇంకెందరున్నారో మరి! కినిగె వారు ఇప్పటికన్నా ఈ పుస్తకం గురించి వ్రాసిన నాలుగు మాటల్లో ఇదొక కథ సంకలమని తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని నా అభిప్రాయం.

ఇది ఒక అద్బుతమైన కథల నమాహారం. ప్రత్యేకించి మిథునం చాలా అద్బుతంగా, హ్రుద్యంగా ఉంది.

మిథునం చదివినప్పుడు ఓ పిల్లతెమ్మెర మనస్సుని తాకింది .... శ్రీ రమణ ఆ అనుభూతికి మీకిదే వందనాలు ...

Excellent book... One of the best ever!

"కాపరం , కత్తిపీట కొత్తల్లో కంటె కొంచం పదును పడ్డాకే బాగుంటాయి రా...", భలెగా చెప్పారు రమణ గారు, Loved It.

I cannot read Telugu, purchased this book for my father and he just loves it. Please could you suggest some books similar to Mithunam.

శ్రీరమణ ఇంటర్వ్యూ కినిగె పత్రికలో ఇక్కడ:—

http://patrika.kinige.com/?p=447

Very nice book ..I saw the movie midhunM but after reading the story only I really able to connect to the characters.
Rest of the stories also very nice and nostalgic rendezvous.

Mithunam.... Ohh Gadamaina anubuthi guppuna manasuku thaki oh pathikellu venakki thesukelindhi....

midhunam what a wonderful book.
Eee midhunam story chaduvutoo, nenu appadaasu, buchhi lakshmi inti daggara peratlo vunna anubhooti pondaanu. Okka saari nenu singapore lo vunna sangati marchi poyaanu.

Awesome Story!
Thoroughly enjoyed reading it :)

Thanks a lot Late Sri Ramana garu, Tanikella Bharani garu and Navodaya publications :)

I like this book so much. All stories in this book are really very good.

కథ కాదు జీవితం, ఒకరి బాధ ఇంకొకరి వినోదం, ఒకరి జీవితం ఇంకొకరికి మార్గదర్శిని, ప్రేమంటే కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోవడం ఇంకొకరి కోసం జీవించడం.

ఎన్నిసార్లు చదివినా వదిలేసింది చాలా ఉంది అనిపిస్తుంటుంది.