మిథునం
అప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్లు ఓమూల పొందికగా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి, మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి.
ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి "-ఏంచేస్తావే ఇన్ని కట్టెలూ...?"అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ.
ఆవిడ చురుక్కున ఒక చూపు చూసి"రేపు నువ్వు హరీ అంటే చితిపేర్చడానికి కావద్దూ..." అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ-
ఆయన ఏమాత్రం చలించకపోగా ఫెళఫెళా నవ్వి -"హసి నీ దుంపతెగా- నీకెంతముందు చూపే ముసలి ఘటమా..." అని అటుగా వెళ్తున్న నన్ను పిలిచి "చూశావురా-మీ అత్తయ్య పాతివ్రత్యం! సతీ సహగమనానికి సిద్ధమవుతోంది వెర్రి మొహంది- లేకపోతే యీ ఒక్క కట్టెకి యిన్ని కట్టెలు కావాలిట్రా...?" అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ- ఆ మాటకు నాకూ నవ్వొచ్చింది. ఆవిడ పటపటా లేని పళ్లు కొరకబోయి పెదాలతో నాలిక్కరుచుకుంది. ఖోపంగా మెటికలు విరిచి అవీ కటకటమనకపోతే ఉక్రోషం ఆపుకోలేక "అబ్బో! సరసాలకేం తక్కువలేదు. బోడి చమత్కారాలకి మాత్రం లోటు లేదు... ఒక నగనా- ఒక నట్రనా -కాపరానికొచ్చి అరవయ్యేళ్ళు అయింది. ఒక ముచ్చటా అచ్చటా-ఒక రొచ్చారనా ఒకరు పోయారనా- ఒక తీర్థమా ఒక శార్థమా-" ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది.
....
- ₹ 54 MRP ₹ 60 (10% discount)
- Expected delivery days: 5
- Eligible for minimum shipping
- ₹ 30 Gift a Rent
- ₹ 54 Gift an Ebook


ఇది ఒక అద్బుతమైన కథల నమాహారం. ప్రత్యేకించి మిథునం చాలా అద్బుతంగా, హ్రుద్యంగా ఉంది.
మిథునం చదివినప్పుడు ఓ పిల్లతెమ్మెర మనస్సుని తాకింది .... శ్రీ రమణ ఆ అనుభూతికి మీకిదే వందనాలు ...
Hi
I bought the e-Book Midhunam. But, not able to download. It is giving an error. Can you help??
-Sarma Cherukuri
Melbourne
my mail id: cvsvs@yahoo.com
Mithunam.... Ohh Gadamaina anubuthi guppuna manasuku thaki oh pathikellu venakki thesukelindhi....
midhunam what a wonderful book.
Eee midhunam story chaduvutoo, nenu appadaasu, buchhi lakshmi inti daggara peratlo vunna anubhooti pondaanu. Okka saari nenu singapore lo vunna sangati marchi poyaanu.
Awesome Story!
Thoroughly enjoyed reading it :)
Thanks a lot Late Sri Ramana garu, Tanikella Bharani garu and Navodaya publications :)
I like this book so much. All stories in this book are really very good.
కథ కాదు జీవితం, ఒకరి బాధ ఇంకొకరి వినోదం, ఒకరి జీవితం ఇంకొకరికి మార్గదర్శిని, ప్రేమంటే కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోవడం ఇంకొకరి కోసం జీవించడం.
ఎన్నిసార్లు చదివినా వదిలేసింది చాలా ఉంది అనిపిస్తుంటుంది.
Excellent book... One of the best ever!