• yugapurushuni prahasanaalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యుగపురుషుని ప్రహసనాలు

    yugapurushuni prahasanaalu

    Pages: 35
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కందుకూరి వీరేశలింగం నిస్సంశయంగా యుగపురుషుడు. చిత్తశుద్ధితో, కార్యదీక్షతో సంఘసంస్కరణ పతాకను ఎగరవేసిన ప్రథముడు, నిజాయితీ, ఆత్మగౌరవం జాతిలో నెలకొల్పిన ఆద్యుడు. పూనుకొన్న ప్రతి కార్యాన్నీ అప్రతిహత దీక్షతో కొనసాగించి, మహత్తర కార్యంగా సాధించిన మహనీయుడు. క్రియాశీలిగా, ఆదర్శ పురుషునిగా తెలుగుజాతి తరతరాలకూ కీర్తించుకోతగిన మాననీయుడు.

ఆధునిక సాహితీ ప్రక్రియలకెన్నిటికో ఆయన ఆద్యుడు. తెలుగు భాషలో సమకాలీన సమాజ ప్రతిబింబాలనదగిన పాత్రలను సృష్టించి, సాహిత్యాన్ని పితృదేవతల కట్టుబానిసత్వం నుంచి తప్పించిన క్రాంతదర్శి. ప్రతి రచనను సామాజిక విప్లవ విస్ఫులింగంగా మార్చిన ప్రథమ విప్లవ తరంగం వీరేశలింగం. తాను రచించిన అసంఖ్యాక ప్రహసనాలకు సజీవ వ్యవహారిక భాషనే ప్రయుక్తం చేసి సామాజిక వాస్తవికతను సాధించాడయన. తెలుగుసాహిత్యం అంతకు మునుపెన్నడూ ఎరుగని అనేక నూత్న ప్రక్రియలను అందించమేగాక, ప్రహసనాల ద్వారా సామాజిక నాటకాలకు తొలిదీపం వెలిగించిన ఆరాధ్యుడు.

సంభాషణారీతిలో “బ్రాహ్మవివాహం” మొదలుకొని నలభై పైచిలుకు చిన్నాపెద్దా ప్రహసనాలు రచించాడు. సంఘంలోని సకల కాలుష్యాలనూ కడిగివేయాలన్న స్థిర సంకల్పంతోనే - 'హాస్యరస పోషకంగా, వ్యంగ్య ధోరణిలో' సంఘ దురాచారాలను విమర్శించడానికి ప్రహసనమొక నిశితాయుధమని ఆయన విశ్వసించాడు.

Preview download free pdf of this Telugu book is available at yugapurushuni prahasanaalu
Comment(s) ...

Request readers to go thru 'Bangaluru Nagaratnamma' auto-biography book before making opinions about Sri Kandukuri Veeresalingam Pantulu.