• vijayaM vaipu payanaM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయం వైపు పయనం

    vijayaM vaipu payanaM

    Pages: 187
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక శుక్రవారం సాయంత్రం-

లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది.

స్పష్టంగా వినడం కోసం, చదువుతున్న పుస్తకం మూసేసి బయటకొచ్చాను. లైబ్రరీ బయట నాలాంటి వాళ్లే కొందరు తాదాత్మ్యతతో వింటున్నారు. నేను కూడా కూర్చున్నాను. అందరం నిశ్శబ్దంగా ఆ ఫిడేలు గమకాల్ని ఆస్వాదిస్తున్నాం. ఆ సమయంలో ఒక ముప్ఫై ఏళ్ళ వ్యక్తి ఇద్దరు పిల్లల్తో అక్కడికి వచ్చి కూర్చున్నాడు.

అక్కడి వాతావరణం మారిపోయింది. ఆ పిల్లలిద్దరూ ఒకర్నొకరు కొట్టుకుంటూ, అల్లరి చేస్తూ మా మధ్య తిరుగుతూ గోల చెయ్యసాగారు.

అయిదు నిముషాలు గడిచాయి. అందరికీ చాలా ఇబ్బందిగా వున్నా, మొహమాటం కొద్దీ సహిస్తున్నారు. ఫిడేలు రాగం ఇంకా వినిపిస్తూనే ఉంది. నేను ఇక ఆగలేక- "ఇది లైబ్రరీ, మీ పిల్లల్ని గోల చెయ్యవద్దనండి" అన్నాను కరుగ్గా. అతడు తన నిస్తేజమైన కళ్లతో నావైపు చూసాడు. "గోల చేస్తున్నారు కదూ, అవును. పిల్లలు... వాళ్ల అమ్మ ఇప్పుడే చనిపోయింది. అరగంట తరువాత శవాన్ని ఇస్తామన్నారు- ఆస్పత్రిలో గొడవ చేస్తున్నారని ఇలా తీసుకొచ్చాను" అన్నాడు.

అతడి మీద అప్పటివరకూ ఉన్న కోపం- జాలిగా మారింది.... కోపం... జాలిగా, అసూయ- ప్రేమగా, ద్వేషం- స్నేహంగా, పగ- ప్రేమగా, అసమర్థత- సమర్థతగా, ఆవేశం- ఆలోచనగా మారవచ్చు. ఇవన్నీ మన బలహీనతల స్థాయిభావాలు.

కావల్సిందల్లా పరిస్థితిని పైస్థాయిలోంచి పరిశీలించగల్గడమే. సమస్యని అవతలి కోణంలోంచి చూడగల్గడమే.

అప్పుడు మనకెవరూ శత్రువులుండరు. మనకి సమస్యలుండవు. ఉన్నా, వాటిని నవ్వుతూనే పరిష్కరించుకోగల స్థిరత్వం మనకి అలవడుతుంది.

అదే విజయం వైపు పయనం.

Preview download free pdf of this Telugu book is available at vijayaM vaipu payanaM