• vijaya vilaasam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయ విలాసం

    vijaya vilaasam

    Pages: 151
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విజయ విలాసం

మూలం: చేమకూర వేంకటకవి

వచన రచన: గుంటి సుబ్రహ్మణ్య శర్మ

అర్జునుడు విస్మితుడై సాంబుని వైపు చూచినాడు. అతని అభిప్రాయం నెరిగి సాంబుడు మరల ఇట్లన్నాడు.

"కృష్ణుని చెల్లెలగు సుభద్ర సంగతి నీకు తెలియును గదా?"

సుభద్ర పేరు వింటూనే పార్థున కెందుకో ఎక్కడలేని తమి ఉదయించింది.

"సాంబా! అన్నట్లు మరచిపోయాను. ఇంతమంది సంగతు లడిగితిని కాని, సుభద్ర సంగతులే అడుగలేదు. ఆమె ఇప్పుడెలాగుంది?"

"ఎలాగుండుటేమి? చక్కని బంగారు బొమ్మలాగా తయారైంది. మిసమిసలాడే నూత్నయవ్వనంతో చూస్టే దృష్టిదోషం తగిలేట్టుంది సుభద్ర. ఏ లోకంలో కూడా ఆమెకు సమానమైన అందగత్తె ఉండజాలదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక్క మాటలో, ఒక్క చిటికెలో ఆమె మనోహరమైన రూపవైభవాన్ని, హావభావ చాతుర్యాలను వర్ణించేందుకు ఒక్క నోరున్న వారి కెవ్వనికి సాధ్యం కాదు"

"అంత అందంగా తయారయిందా సుభద్ర!"

"మరేమనుకొన్నావు సుభద్ర అంటే? ఆమె మాట్లాడితే అమృతం కురిసినట్టుంది. ఆమె అంగసౌష్టవాన్ని వర్ణించాలంటే కవులు కావ్యాల్లో వ్రాసే ప్రతీ వస్తువును పేర్కొని "దీని కది, దాని కది" అని పోల్చి చెప్పవలసిందే. ఆమె నవ నవోన్మేషమగు యౌవ్వన విలాసములను మన మింతకు ముందే సుందరాంగి విషయంలో కూడ చూచి యుండము. అట్లని విని కూడ యుండము. ఇంతవరకూ కావ్యాల్లో చెప్పబడినవన్నీ సామాన్య విషయాలే. ఇక విశేషాలను గురించి వర్ణించాలంటే నాకా శక్తి చాలదు. ఆమె అందచందాలు కన్నులతో చూడాలి - మనసులో ఆనందించాలి. అంతే."

Preview download free pdf of this Telugu book is available at vijaya vilaasam