• viduraneethi kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విదురనీతి కథలు

    viduraneethi kathalu

    Pages: 188
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విదుర నీతి మహాభారతంలో మహత్త్వపూర్ణ సందేశం! వక్త విదురుడు. శ్రోత ధృతరాష్ట్రుడు! వక్త శ్రోత కంటే వయస్సులోనూ లౌకికమైన అధికారంలోనూ చిన్నవాడు. జ్ఞాన సంపదలో మిన్న! పరహితమే ప్రాణంగా బ్రతుకుతున్న ధన్యాత్ముడు. వ్యాస భారతం ఉద్యోగపర్వంలో ప్రజాగర పర్వంగా వీరిద్దరి సంవాదం 600 శ్లోకాల్లో మహానీతి శాస్త్రంగా రూపొందింది. కథాశిల్పం తెలిసిన సూర్యప్రసాదరావుగారు విదుర నీతులను కథల రూపంలో మలిచారు.

శ్రీ సూర్య ప్రసాదరావుగారి ఈ కథా సంపుటిలో 26 కథలు ఉన్నాయి. వీరి శైలి సరళసుందరం. కథా శిల్పంలో ఎత్తుగడ, ముగింపు కీలకమైనవి. నిర్వహణ వీరి కథన శైలిని ప్రతిబింబిస్తుంది. వీరి ఎత్తుగడలు నాటకంలోని నాందీ వాక్యంలా కథాంశ సూచకంగా ఉన్నాయి. ముగింపులు సరళ సుందరమైన నీతిని అందిస్తూ ఆ నీతితో పులకరించిన పాత్రల మనోభావాలను, మానసిక సంచలనాన్ని చిత్రించాయి. కథ మధ్యలో విదుర నీతి ప్రస్తావించబడింది. ఆ నీతి శ్లోకానికి ప్రతిపదార్ధ వివరణ, తాత్పర్య బోధ చక్కగా సాగింది. ప్రాస్తావికంగా కథల్లో సుమతీ శతకం పద్యాలు, వేమన పద్యాలు చోటుచేసుకోవడం కథ సౌందర్యాన్ని ఇనుమడింపజేసింది. ఆయా పాత్రల ద్వారా సంభాషణ రూపంలో విదుర నీతులను చక్కగా అందించారు.

- డా. దామెర వేంకట సూర్యారావు

Preview download free pdf of this Telugu book is available at viduraneethi kathalu