• tripura kathalu print book
    • fb
    • Share on Google+
    • Pin it!
  • త్రిపుర కథలు

    tripura kathalu print book

    Author:

    Publisher: Perspectives

    Pages: 248
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

త్రిపుర కథలు ఈ-బుక్ ఇక్కడ

* * *

అర్థం కావడానికీ, విశ్లేషణకీ అతీతమయిన కథల్లో త్రిపుర కథలు చేరతాయి. ఆయన కథలు అర్థం కాకపోయినా, లోపలికి ప్రవేశించి కొత్తచూపు ప్రసాదిస్తాయి.

వాచీలకు అతీతమయిన కాలం గురించి బహుశా ఒక భారరహిత స్థితి గురించి త్రిపుర పలవరిస్తాడనుకుంటాను.

“జ్ఞాపకాల ముక్కల అస్తవ్యస్తపు సముదాయమే జీవితం”

కాఫ్కా ప్రాపంచిక దృక్పథం త్రిపురని తీవ్రంగా ప్రభావితం చేసింది. త్రిపుర ఆస్తికుడు కాదు. కానీ, ఆ దృక్పథం ఉన్న కీర్క్ గార్డ్, పాస్కాల్ ఆయనకి ఆత్మీయులు. ప్రాథమికంగా ఈ అనంత కాలవాహినిలో మనిషి ఉనికి గురించి త్రిపురకేర్పడిన ఎరుక ఆయన కథలు.

“డిజార్డర్. నీ జీవితానికర్థం డిజార్డర్. నీ దేహానికీ, నీ మెటఫిజికల్ ఉనికికీ అర్థం డిజార్డర్”

మన అలజడి, అశాంతి, ఆవేదన, ఆకాంక్షల బావిలోంచి బయటికిలాగి కొండ అంచున నిలబెట్టి దిగువ అగాధాన్నీ పైన అనంతాన్నీ చూపించి మన వస్తుప్రపంచాన్ని ముక్కలుచేసి వదులుతాడు త్రిపుర. విశాఖ మాండలికంలో తెలుగుతనం మెరిసిపోయే మెటఫర్ త్రిపుర కథల విలక్షణత.

కలవడం, విడిపోవడం, పోగొట్టుకోవడం, నిరీక్షించడం అనే నాలుగు బిందువుల మధ్య జీవితం నిర్విరామంగా తిరుగుతూ ఉంటుంది.

జీతే రహో త్రిపురాజీ!

- తల్లావజ్జుల పతంజలిశాస్త్రి

Comment(s) ...

త్రిపుర కథలు ప్రింట్ పుస్తకం Stock ఎప్పుడు వస్తుందో తెలుపగలరు...