• telugu saahityaMlO haasyOktulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 63
    70
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు సాహిత్యంలో హాస్యోక్తులు

    telugu saahityaMlO haasyOktulu

    Pages: 160
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హాస్యరచన చెక్కిలిగింత లాటిది. ఎలాపెడితే, ఎక్కడ తాకితే నవ్వు కల్గుతుంతో చెప్పటం కష్టం. తెలుగు హాస్యరచనల పుట్టుక, పెరుగుదల గురించి ఎవరూ గంభీరంగా విశ్లేషించలేదు. అలాచేస్తే, చేసినవారిని అమాయకులుగా భావిస్తారు తప్ప. పట్టించుకోరు. నవ్విస్తే సంతోషిస్తారు కాని విడమరిస్తే విసరేస్తారు. అయితే విషయం, విషయమే కదా, విశేషమయినదేక దా. చదువుకనగల రచనల్లో నవ్వు పుట్టే పద్దతి ఎన్నిరకాలుగా విలసిల్లగలదో ఈ పుస్తకంలోని అనేక అంశాలు విప్పి చెప్తాయి. అలా ఎన్నో వాక్యాలతో, పదాలతో, సంఘటనల అమరికలతో, తేజోవంతమైన ప్రతిభతో, తాము చూసినవాటినీ, విన్నవాటినీ, కల్పించినవాటినీ నవ్వుల విందుగా ఆనాటి రచయితలు ఎలా అందించారో ఈ సంకలనంలో మువ్వల, గజ్జె కట్టించి మరీ ప్రదర్శించారు.

ఈ గ్రంధంలో గుచ్చెత్తిన హాస్యరచనలు, విదేశీయుల కొసమెరుపుల్ని, రిపార్టీలనీ: మన పద్య, గద్య వైభవాన్ని పునరుక్తి పటుత్వాన్నీ ఎలా నిలబెట్టినవో వివరిస్తాయి.

హిందీభాషలో సమకాలీన హాస్య కవితారంగం వినూత్న పోకడలు పోతున్నది. మనం ఈ రంగంలో వెనుకపడిపోయాం. కాని మనదైన పద్యరచనా విదానంలో ఆనాటి హాస్యరచయితలు ఎంత సులువుగా ఎంత మక్కువతో, పాఠకరంజకంగా హాస్య కవిత్వం రచించారో ఈ గ్రంథం వివరిస్తుంది. ఎన్నో ఆకరాలు, పడికట్లు, ఊహలు హాస్య కవిత్వ సంతానానికి అవసరమయిన వస్తు, విషయ శైలీ సాంగత్యాన్ని అందించాయని తెలుస్తుంది. ఇంతటి వారసత్వాన్ని పుచ్చుకున్నా ఈనాటి హాస్యకవులు ఎందుచేతనో ఉత్తేజ పొందలేదు.

ఆధునిక ప్రక్రియలు సార్వకాలికమూ, సార్వదేశీయమూ కాగలవని చెప్పలేము. ఇతర ప్రక్రియల మాదిరిగానే హాస్యరచనా ప్రక్రియ కూడా ఆనాటి సామాజిక స్పందనలకీ, వర్గచయనానికీ అద్దం పట్టింది. వందసంవత్సరాలుగా సాగిన తెలుగుదేశపు మెరుపులకీ మచ్చలకీ, వర్గాల నడతలకీ, వర్ణదుర్గాల పడకలకీ ఈ సంకలనంలోన రచనలు సూచికలుగా నిలచాయి. మన అలవాట్లు, వృత్తులూ, కులాలకాకలు, దొరతనం కల్గించిన కాకువులూ, వాడుకలోని భాష తెచ్చిన శ్లేషులు, సమాజంలోని చికాకులూ ఈ రచనల్లో ప్రతిఫలించాయి. హాస్యరచనల్లో ఎంత పరిణతిని సాధించవచ్చునో, ఏరకం పరిమితులుంటాయో తెలుస్తుంది.

ఎప్పుడో అద్దేపల్లి లక్ష్మణకవి వర్ణన రత్నాకరం సంకలనాన్ని తెచ్చి వర్ణనలను ఒకచోటకు చేర్చారు. ఇప్పుడు హాస్యరత్నాకరంలోని రత్నాలను మువ్వల సుబ్బరామయ్యగారు పోగుచేసి చూపారు. ఇష్టం, కష్టం ఆయనది. ఆనందం మనది. ముందు తరాలది.

- పన్నాల సుబ్రహ్మణ్యభట్టు

Preview download free pdf of this Telugu book is available at telugu saahityaMlO haasyOktulu