• telugadElayanna
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుఁగదేలయన్న

    telugadElayanna

    Pages: 394
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"తెలుఁగదేల..." అని తన కాలంలో కూడా బహుశా ఎవరో కొంటె బుద్ధులు ప్రశ్నించి ఉండబట్టే, పది భాషలు తెలిసిన ఆంధ్ర-కర్నాటక ప్రభువైన శ్రీకృష్ణ దేవరాయలు ఇది తెలుగు దేశం కాబట్టే, దేశ భాషలలో కెల్లా తెలుఁగు శ్రేష్టమైన (లెస్స)దనీ, యోగ్యమైనదని సమాధానం చెప్పాడు.

కాని రాయల పాలనా, రాజ్యపాలనా ముగిసిపోయి అయిదు వందల ఏళ్ళు గతించిపోయినా, బ్రిటీష్, మొగలాయీ పరాయి సామ్రాజ్యపాలనల కింద చితికిపోయిన తెలుగువారంతా జాతిపరంగా ఏక భాషా ప్రాతిపదికపైన భాషా ప్రయుక్త రాష్ట్రం విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) గా అవతరించిన పిమ్మట కూడా మనకు 'మనకు తెలుగెందుకు' అనే పాలకులు, కొందరు ఉన్నత విద్యాధికులు కూడా మన మధ్య ఉండడం మన దురదృష్టం!.

ఇంగ్లీషు అంతర్జాతీయ పాలనా, వాణిజ్య భాషగా మారింది! అంతమాత్రాన ఏ దేశ మాతృభాషలనూ మనం కించపరుచుకోవలసిన అవసరంగానీ పనిగట్టుకుని వాటి ప్రాధాన్యతను, ప్రాశస్త్యాన్ని తగ్గించుకోవటంగానీ, పాఠశాల విద్యాదశలో మాతృభాషల్ని బోధనా మాధ్యమంగా తొలగించుకోవలసిన అవసరంగానీ ఎంతమాత్రమూ లేదు.

తల్లిభాషను కౌగిలించుకుంటూ, సర్వత్రా కాపాడుకుంటూనే, పరభాషలను అవసరంమేరకే గౌరవించుకోవటమూ నేర్వాలి. నేర్పాలి. ఆ మాటకొస్తే పట్టభద్ర స్థాయి విద్యలోనేగాక పట్టభద్రానంతర దశల్లోనూ, శాస్త్ర, సాంకేతిక వైజ్ఞానిక విద్యాదశలన్నిటా కూడా మాతృభాష విధిగా ఒక అంశంగా కొనసాగుతునే ఉండాలి.

మాతృభాషకు సంబంధించినంత వరకూ, దాని ఎదుగుదలకూ, పెరుగుదలకు, సుస్థిరతకు అటు పాలానా భాషగానూ, ఇటు బోధనాభాషగానూ అమలు చేయవలసిన అవసరం నేడు మరింత అవశ్యం.

Preview download free pdf of this Telugu book is available at telugadElayanna