• talapula talupulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తలపుల తలుపులు

    talapula talupulu

    Pages: 128
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆకాశవాణిలో 30 సంవత్సరాల ఉద్యోగజీవితంలో అనంతపద్మనాభరావుకు ఎందరో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డయి. తమ జ్ఞాపకాల దొంతరల లోంచి, సినీ రాజకీయ సాహిత్య రంగాలకు చెందిన వ్యక్తుల జీవన రేఖలను, వారి జీవితంలో కొన్ని మధుర సన్నివేశాలను అందించారు. నవ్యవారపత్రికలో ధారావాహికంగా 2011 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య వారం వారం ప్రచురించిన 'తలపుల తలుపులు' గ్రంధంలో 28 పరిచయాలు చోటు చేసుకొన్నాయి. జగ్గయ్య, హరనాధ్‌, భానుమతి, ధూళిపాళ, మిక్కిలినేని, అల్లు వంటి సినీ ప్రముఖుల చలనచిత్ర తళతళలు; శంకరంబాడి, పుట్టపర్తి, దాశరధి, ఆరుద్రల సాహితీ సుగంధాలు; పి.వి, కాసు, జలగం, గోపాలరెడ్డి, యన్‌.టి.ఆర్‌. వంటి ప్రముఖుల రాజకీయ చతురత, ఈ జ్ఞాపకాల ప్రవాహంలో మనల్ని ఓలలాడిస్తాయి.

కడప, విజయవాడ, అనంతపురం, ఢిల్లీ కేంద్రాలలో పని చేస్తున్నప్పుడు ఆయా రంగాల ప్రముఖుల పరిచయాలు ప్రసారం చేశారు. ఆ పరిచయాలు వివరంగా గ్రంథంలో పొందుపరిచారు. నవ్యవారపత్రిక పాఠకుల్ని విశేషంగా ఆదరించిన ఈ తలపులు ఒక సాహితీవేత్త తెరిచిన భావనల తలుపులు. అనంతపద్మనాభరావు అశేష పాఠకలోకానికి అందిస్తున్న 'తలపుల తలుపులు' తలుపు తెరచి లోపలికెళ్దాం.

Preview download free pdf of this Telugu book is available at talapula talupulu