• saptati satkruti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • సప్తతి - సత్కృతి

    saptati satkruti

    Author:

    Publisher: Marumamula Rukmini

    Pages: 72
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాదః, సల్లాపస్సజ్జనై స్సహ"
సంసారమనేది ఒక విషవృక్షమైతే... దాని రెండు ఫలాలు మాత్రం అమృతమంత మధురంగా ఉంటాయట. అవి (1) కావ్యామృతాన్ని ఆస్వాదించడం. (2) సజ్జనులతో సద్గోష్టి జరపడం.

నిజమే... మనమెత్తిన ఈ జన్మకు కారణం మనం కాదు.. ఎందుకీ మానవ జన్మ లభించిందో కూడా ఎవరికీ తెలియదు... ఎప్పుడెలా ఈ ఆట ముగుస్తుందో కూడా అంతుపట్టదు. దుర్లభమైన ఈ మానవజన్మనూ, అందునా శ్రేష్ఠతమమైన స్థితిని పొంది కూడా సారసంసారాన్ని నిస్సారంగా చేసుకోడమెందుకు?

ఉన్నదాన్ని వదులుకోవడం, లేనిదాని కోసం అర్రులు చాచడం, అన్నీ నావేననే భ్రమలో మసలడం, చేతులు కాలాక ఆకుల కోసమై అంగలార్చడం వంటి అవివేకాలు ఎన్నో.. ఏ కొన్నో అందరికీ అనుభవైక వేద్యాలే.

మనమున్న స్థితినే కలకలం మనుస్థితిగా మలచుకోగల సత్తా ఉన్నా లేనివాళ్ళమౌతున్నాం. మానవీయ లక్షణాలన్నీ క్రమక్రమంగా మాయం చేసుకుంటున్నాం. అయోమయంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం.

ఒక్క క్షణం ఆలోచించి.... వివేకంతో వినడం మరిచిపోతున్నాం. కళ్ళారా కనడం కష్టమనుకుంటున్నాం. కట్టుబొట్టు- కట్టుబాట్లు కట్టడులని వదిలేస్తున్నాం. సమిష్టి నుంచి వ్యష్టికి మారిపోతూ... మరో తరానికి మార్గదర్శనం అందించలేని దౌర్భాగ్యానికి గురౌతున్నాం. సంపాదనంటే నిశ్శ్రేయస్సంపాదనమనే సంగతినే గుర్తించలేకున్నాం.

ఐనా మనకెన్నో దారి చూపే దీపాలున్నాయి. తరతరాల వారసత్వముంది. దర్శనాల ఆదర్శాలున్నాయి. సాంప్రదాయిక సంస్కారాల నేపథ్యాలున్నాయి. అన్నీ ఉన్నా అవసరానికి తెలియజెప్పే 'చుక్కాని' కనుమరుగవుతున్నాడు.

ఐతే చీకటిని తిడుతూ కూర్చునేకంటే చిరుదివ్వెనైనా వెలిగించాలన్నదే మా ఈ ప్రయత్నం. సంస్కారవంతులైన సద్విషయ సంపన్నులైన ఈ సంచికా రచయితల అక్షరకాంతులే మనకు దారి చూపే దీపాలు. ధన్యచరితులైన మా తల్లిదండ్రుల ఆదర్శ జీవన సాఫల్యాలకు అద్దం పట్టేవే ఇందలి వ్యాసాలు - కవితలు. మా అమ్మానాన్నల హృదయంలాగానే ఈ ప్రత్యేక సంచిక నిండా పరచుకున్న భావాలన్నీ నిష్కల్మష సౌరభాలనే విరజిమ్ముతున్నాయని మా ప్రగాఢ విశ్వాసం. అవి మీకూ తప్పక రుచిస్తాయనే నమ్ముతున్నాం.

- మరుమాముల దత్తాత్రేయశర్మ
మరుమాముల వెంకటరమణశర్మ

గమనిక: "సప్తతి - సత్కృతి" ఈ-బుక్ సైజ్ 13.7 MB

Preview download free pdf of this Telugu book is available at saptati satkruti