• sandhya vandanamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంధ్యావందనము

    sandhya vandanamu

    Author:

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“పెన్షన్ పేపర్సంటే ఓ వృద్ధజీవి ఆశాకిరణాలు. వాటిని పైకి వెళ్ళనీయకుండా అల్మారాలో బంధించడం అన్యాయం. అన్యాయాన్ని ఎదిరించే హక్కు, అధర్మవర్తనులను నిలదీసే బాధ్యత అందరిమీదుంది. ప్రభుత్యోగిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత మీమీదుంది. పారదర్శకత అంటే అదే రూల్... కదా!” ఎదురు సవాలు విసిరాను. ముందు కలవరపడి తర్వాత తన ముందున్న ఫైలును ఠకీన మూసేసాడు. నన్ను ఎగాదిగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో రోషం బుసబుసలాడ్తోంది. అవమానంగా ఫీలయాడేమో.

“మాకవన్నీ బాగా తెలుసు. అంతే కాదు. మీకు తెలియని లౌక్యం... అదే ఏ ఆఫీసులో ఎలా పనిచేయించుకోవాలనే ఇంగిత జ్ఞానం గూడా ఉంది. పద్దతులన్నీ బాగా తెలుసు. వాటి గురించి కనీసం మీరిప్పుడన్నా తెలుసుకుంటే బాగుంటుందేమో!” అనేస్తూ పక్క సెక్షన్ క్లర్క్ వైపు చూశాడు. చూశావా! నేనెంత ధైర్యంగా మాట్లాడగల్గుతున్నానో అనే అహంభావం ప్రకటితమైందా చూపులో. అతనిగ్గూడా నా గురించి బాగా తెలుసు.

ఇద్దరూ కలిసి... వీడో ఫూల్... అన్నట్టుగా నన్ను కింది నుంచి మీద్దాక చూస్తూ కసికసిగా ముసిముసిగా నవ్వుకున్నారు... నా నవనాడుల్లో రక్తప్రవాహ వేగం పెరిగింది. ఆవేశం కట్టలు తెంచుకుంది.

“య్యూ... య్యూ ఆర్...” గొంతు నరాలు బిగబట్టి అరుస్తూ బల్లమీద గట్టిగా గుద్దేశాను. “ముందుగా సంగతి చెప్పండి. నా పెన్షన్ పేపర్స్ సంగతేమిటి? వాటిని ఎంత త్వరగా ఏ.జి. ఆఫీసుకు పంపిస్తే...” నా మాటను మధ్యలోనే తుంచేశాడు.

“అంత త్వరగా పెన్షన్ మంజూరవుతాందని తెలుసు. మీరెంత అరచి గీ పెట్టినా అవి ఎప్పుడు ఎలా వెళ్ళాలో అప్పుడు అలా వెళ్తాయి. ఇక మీరు వెళ్ళొచ్చు” విసుక్కుంటూ ఫైల్లో తలదూర్చాడు. నీ దిక్కున్నచోట చెప్పుకో పో అన్నట్టుగుంది అతని వాలకం.

Preview download free pdf of this Telugu book is available at sandhya vandanamu