-
-
ప్రాచీన కవులు
praacheena kavulu
Author: Muvvala Subbaramaiah
Publisher: Jayanthi Publications Vijayawada
Pages: 215Language: Telugu
శ్రీ మువ్వల సుబ్బరామయ్య చాలా మందివలె సాహిత్యాన్ని అభిమాన విద్యగా చదివిన వారు కాదు. అభిమానించి చదివిన వ్యక్తి. 'ప్రాచీన కవులు' పేరుతో వెలయించిన ఈ గ్రంథాన్ని అందుకే తన వలె అభిమానించి సాహిత్యాన్ని చదివే వారికి ఉపయుక్తంగా రచించారు. విద్యార్థులకూ ఇదెంతో ఉపయోగపడుతుంది. ఇందులో సంస్కృత కవులనూ పరిచయం చేసారు. తెనుగు కవుల మాట సరేసరి. అలవోకగా చదివినా స్థూలంగా మన కవులను గూర్చిన సమాచారం అంతా పాఠకునికి అందివస్తుంది. సాధారణ పాఠకుల కొరకు ఇలాంటి పుస్తకాలు రావలసిన అవసరం ఎంతైనా వుంది. ఆ పని చేసినందుకు శ్రీ సుబ్బరామయ్య గారిని అభినందిస్తున్నాను. తెనుగు చదువరులు దీని ఉపయోగాన్ని గ్రహింతురు గాక.
- ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు
"మీరు రచించిన ప్రాచీన కవులు చదివాను. ఒక్క సిట్టింగ్‌లోనే చదివేశాను. కవులను పరిచయం చేసిన పద్ధతి చాలా బావుంది. ఉద్ధండులైన కవులను పరిచయం చేయడం గొప్ప సాహసం - ఈ ప్రయత్నంలో మీరు సఫలీకృతులయ్యారని నా అభిప్రాయం. మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
- డా. 'అంపశయ్య' నవీన్
"ప్రాచీన కవులు ఆసాంతం పరిశీలించాను. ఇంతమంది కవుల పేర్లు విన్నానే తప్ప, నేటికి వారిని గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. మహాకవులనందరినీ క్లుప్తంగా వారి జీవితాల గొప్పదనాన్ని ఈనాటి పాఠకులకు తెలియజేసిన పద్ధతి ప్రశంసనీయం. అందరూ చదవతగినది, అందరికీ ఉపయోగపడే రచన".
- కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
కవుల చరిత్ర వ్రాసి కలకాల యశమిచ్చు
మంచి పుస్తకమ్ము మలచినారు
అభినుతింతు మిమ్ము ఆనంద ముప్పొంగ
శుభము కల్గు మీకు సుబ్బరాయ
- డా. భూసురపల్లి
