• picasso
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పికాసో

    picasso

    Author:

    Publisher: Kaki Prachuranalu

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది కేవలం పికాసో జీవిత చరిత్ర కాదు, యురోపియన్ కళాపరిణామ చరిత్ర కూడ.ఆ అర్థంలో ఆధునిక చిత్రకళా చరిత్ర కూడ. సింబాలిజం, సర్రియలిజం, క్యూబిజం, ఆఫ్రికా, ఐబీరియన్ ఆదిమకళలు - వంటి కళాసిద్ధాంతాల చర్చ ఇందులో పికాసో చిత్రాల చుట్టూ తిరుగుతుంది. పికాసో 'అవిగ్నాన్ యువతులు' చిత్రం వేసిన దగ్గరనుంచీ 'గెర్నికా' మీదుగా, సోవియట్ ప్రభావంతో సామ్యవాద వాస్తవికతా దృష్టి వైపు పయనించేదాకా ఆయన చిత్రకళలోని ప్రయోగాల గురించి మాత్రమే కాదు, చిత్రకళా సిద్ధాంతాల గురించి కూడా మోహన్ ఒక కళా విమర్శకుడిగా ఆధునిక చిత్రకళా జీవితం రాశాడు.

మోహన్ 'కిటికీ పిట్ట' కవిత్వాన్ని పరిచయం చేసినప్పుడు అది ఒక దృశ్యకావ్యం, దానినొక అద్భుతమైన డాక్యుమెంటరీగా నిర్మించవచ్చని ప్రతిపాదించాను. ఆ కవితలు మొత్తం రేఖా చిత్రాలు, నెత్తుటి చిత్రాలఆశ్వాసాలు, నిర్భంధంలోని విశ్వాస ప్రకటన దృశ్యాలు. ఇప్పుడీ పికాసో జీవితం ఒక సుదీర్ఘ చిత్రకావ్యం. ఇది అతిశయోక్తి కాదు. పికాసో జీవితాన్ని, చిత్రకళాపరిణామాన్ని మోహన్ సాహసంగానూ, సమర్థవంతంగానూ, తెలుగు కవిత్వంతో పునర్నిర్మించాడు. తాను రుణపడి ఉన్న కృష్ణశాస్త్రి వేలువిడిచిన శ్రీశ్రీ పికాసో 'మహాప్రస్థానా'న్ని మనకు మోహన్ కుంచెతో రచించాడంటే మీరు నమ్ముతారా? నమ్మాలి మరి.

- వరవరరావు

గమనిక: "పికాసో" ఈ-బుక్ సైజు 14.7MB

Preview download free pdf of this Telugu book is available at picasso