• ooru kottabaDiMdi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఊరు కొత్తబడింది

    ooru kottabaDiMdi

    Author:

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఊరు కొత్తబడింది

పాతవాటితో మనస్సు పెనవేసుకున్న ఓ రచయిత్రి ఓ ఇరవైముప్పయ్యేళ్ళ క్రింది తమ ఊరిని, తాను పెరిగిన ఊరును గురించి ఆలోచించిందనుకోండి! ప్రేమ, ఆర్ద్రత, సాన్నిహిత్య స్పర్శ, నాటి చెట్టూ చేమ పలకరింపులు, తోటి స్నేహితుల ఆటల్లో పులకరింతలు ఒక్కక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటుంటే అవి రసరేఖలుగా, దీపశిఖలుగా కళ్ళముందు నిలుస్తాయి. అలా నిలిచిన కారణంగానే డా. తుమ్మలపల్లి వాణీకుమారి గారి 'ఊరు కొత్తబడి' ఆవిర్భవించింది.

ఓ నలభైయేళ్ళు వెనక్కు వెళ్ళారు. పచ్చిగా ఉన్న బాల్యంలో అడుగులు వేశారు. అప్పటి తప్పటడుగులు గుర్తున్నాయి; అదీ సంతోషం. ఎక్కడో మనసు పొరల్లో దాగినవి, హృదయం లోతుల్లో తాకీ తాకనట్లు ఉన్నవి బయటకు లాగడం మాములు మాట కాదు.

అలా కూర్చుని, ఆ ఊహాలోకంలో విహరిస్తుంటే వారెన్నో పర్యాయాలు తమను తాము మరిచిపోయి ఉంటారు. అప్పుడు ఆ పక్కన ఎవ్వరు సవ్వడి చేసినా వారికి వినిపించదు. లోకాన్ని వదలి లోపలికి చూచుకొన్నప్పుడు కనిపించే మధుర సన్నివేశాలెన్నెన్నో!!

అయితే ఆ భావుకతలో లీనం కాకుండా తమను తాము గిల్లుకొని వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి అప్పటివరకు మనోముకురంలో కనిపించిన దృశ్యాలకు అక్షరాకృతినిచ్చారు; ఆ ఆకృతే "ఊరు కొత్తబడింది" .

- ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at ooru kottabaDiMdi