• mukhyamantri Rosaiah sambhashana chaturudu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముఖ్యమంత్రి రోశయ్య - సంభాషణా చతురుడు

    mukhyamantri Rosaiah sambhashana chaturudu

    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
పుస్తకం రచయత గురించి

1978లో జర్నలిజంలో ప్రవేశించిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణాజిల్లా గన్నవరంలో పుట్టి పెరిగారు. ఈనాడు పత్రికలో 24 ఏళ్ళపాటు వివిధ హోదాల్లో 2002 వరకు పనిచేశారు. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, న్యూడిల్లీలలో ఈనాడు దినపత్రిక సీనియర్ రిపోర్టర్, చీఫ్ రిపోర్టర్ బాధ్యతలు నిర్వహించారు. 2002 ఆగష్టు నుంచి 2006 డిసెంబర్ వరకు ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యూరోచీఫ్‌గా పనిచేశారు. 2007 జనవరి నుంచి ఆగష్టు వరకు ఎన్‌టివిలో పొలిటికల్ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా వున్నారు. 2007 సెప్టెంబర్ నుంచి 2009 ఆగష్టు వరకు టివి5లో ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. టివి9, ఈటివి2, తేజ టివిలలో జరిగిన పలు రాజకీయ, రాజకీయేతర చర్చలలో విశ్లేషకుడుగా పాల్గొనేవారు.

2006లో ఎన్‌టివిలో "పొలిటికల్ కామెంట్" పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత దాదాపు రెండేళ్ళు టివి5లో "న్యూస్‌స్కాన్"తో పాటు పలు చర్చలు నిర్వహించారు. తిరిగి 2009 నుంచి ఎన్‌టివిలో "లైవ్‌షో విత్ కెఎస్‌ఆర్" పేరుతో ఓ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 1994 నుంచి 2001 వరకు ఈనాడులో "రాష్ట్రంలో రాజకీయం" పేరుతో, 2002 సెప్టెంబర్ నుంచి 2006 డిసెంబర్ వరకు ఆంధ్రజ్యోతిలో "తాజాకలం" పేరుతో రాజకీయ, రాజకీయేతర వ్యాసాలు వ్రాశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో వెలువడిన వ్యాసాలను ఎంపిక చేసి పుస్తకాలు ప్రచురించారు. ప్రస్తుతం ఆంధ్రప్రభలో "కెఎస్‌ఆర్ కాలం" పేరుతో ప్రతి గురువారం వ్యాసాన్ని వ్రాస్తున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాక్షి పత్రికలో కూడా పలు వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అమెరికా, బ్రిటన్, సింగపూర్, చైనా తదితర దేశాలను సందర్శించారు. ప్రధాని మన్మోహన్ బృందంతో కలిసి నెదర్లాండ్స్‌కి వెళ్ళి వచ్చారు. 1999లో ఆంధ్రా టు అమెరికా పుస్తకాన్ని రచించారు. తెలుగుతీర్పు 1952-2002, తెలుగు ప్రజాతీర్పు 1952-2004, తెలుగు ప్రజాతీర్పు 1995-2008 పేరుతో అన్ని శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల విశేషాలతో పుస్తకాలు ప్రచురించారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు 1952 నుంచి 2002 వరకు జరిగిన చట్టసభల ఎన్నికల విశేషాలను ప్రచురించారు. రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చల ముఖ్యాంశాలు, నాటి సమావేశాల తీరుతెన్నులపై శాసనసభ చర్చల సరళి-1 (1956 - 60), శాసనసభ చర్చల సరళి-2(1961-71), శాసనసభ చర్చల సరళి-3(1972-82) పుస్తకాలను ప్రచురించారు. తాజాగా "ప్రాంతీయ ఉద్యమాలు-పదవీ రాజకీయాలు", "రాజకీయ చదరంగంలో ఆంధ్రప్రదేశ్ - ఆంధ్రనేతల చారిత్రక తప్పిదం" పుస్తకాలను రచించారు.

Preview download free pdf of this Telugu book is available at mukhyamantri Rosaiah sambhashana chaturudu